జమ్మూ, పఠాన్ కోట్, ఉధంపూర్ లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సమయంలో భారత్ పై దాడులకు పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా పదుల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణును, ఫైటర్ జెట్లను పంపింది. అయితే.. వాటన్నింటికీ భారత్ షాకిచ్చింది.అవును… భారత్ పై దాడులు చేయాలని డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లను పాక్ పెద్ద ఎత్తున ప్రయోగించింది. అయితే పాక్ ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టింది. ఇందులో భాగంగా… సీ-400 రక్షణ వ్యవస్థలు, ఎల్-70 గన్స్, జెడ్.యూ-23ఎంఎం, చిల్కా సిస్టమ్స్ టెక్నాలజీతో.. పాక్ డ్రోన్ లను, క్షిపణులను అడ్డుకున్నాయి. అన్నింటినీ గాల్లోనే తుక్కు తుక్కు చేశాయి.
ఈ సందర్భంగా స్పందించిన ఇండియన్ ఆర్మీ.. పాకిస్థాన్ సాయుధ దళాలు 2025 మే 08 – 09 తేదీల మధ్య పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర మందుగుండు సామాగ్రిని ఉపయోగించి అనేక దాడులు ప్రారంభించిందని.. జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ (ఎల్.ఓ.సీ) వెంబడి పాకిస్థాన్ దళాలు అనేక కాల్పుల విరమణ ఉల్లంఘనల (సీ.ఎఫ్.వీ) కు పాల్పడ్డాయని తెలిపింది.అయితే.. డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, కాల్పుల విరమణ ఉల్లంఘనలను సమర్థవంతంగా సమాధానం ఇవ్వబడిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందని.. అన్ని దుర్మార్గపు కుట్రలకు బలవంతంగా ప్రతిస్పందిస్తుందని ఎక్స్ వేదికగా తెలిపింది.
ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి పాకిస్థాన్ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి వివిధ ప్రదేశాలకు డ్రోన్ లను పంపడానికి విఫలయత్నం చేసిన పాక్.. జమ్మూ, ఉధంపూర్, సాంబా, నగ్రోటా, పఠాన్ కోఠ్ ప్రాంతాల్లో భారత ఆర్మీ వైమానిక రక్షణ దళాలు కౌంటర్ డ్రోన్ ఆపరేషన్ నిర్వహించాయని.. ఈ ఆపరేషన్ లో 50కి పైగా డ్రోన్ లను సక్సెస్ ఫుల్ గా అడ్డుకున్నట్లు వర్గాలు తెలిపాయి.ఇదే సమయంలో… సత్వారీ, సాంబా, ఆ.ఎస్.పురా, అర్నియా సెక్టార్ లలో పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను భారత్ నేలకూల్చింది! అదేవిధంగా… మూడు ఫైటర్ జెట్లను భారత్ నేలమట్టం చేసింది! ఇందులో భాగంగా… ఒక ఎఫ్-16 ఫైటర్ జెట్ ను, రెండు జేఎఫ్-17 ఫైటర్ జెట్స్ ను భారత్ కూల్చేసినట్లు తెలుస్తోంది. లాహోర్ సహా 7 చోట్ల గగనతల రక్షణ దళాలను భారత్ ధ్వంసం చేసినట్లు సమాచారం!
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడిందే తప్పించి.. సైనిక స్థావరాలపైనా.. నివాస ప్రాంతాల మీదా ఎలాంటి దాడులకు పాల్పడలేదు. అయితే.. అందుకు భిన్నంగా గురువారం మాత్రం పాకిస్తాన్ లోని విమాన విధ్వంసక వ్యవస్థకు సంబంధించిన రాడార్ మీదా దాడి చేసి దాన్ని దెబ్బ తీసింది? ఎందుకిలా? ఇలాంటి ఎత్తుగడ వెనుకున్న లక్ష్యమేంటి? అన్న వివరాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.నిజానికి ఈ వ్యూహాన్ని సీడ్ స్ట్రాటజీగా వ్యవహరిస్తారు. యుద్ధంలో తొలుత టార్గెట్ చేసేది గగనతల రక్షణ వ్యవస్థలనే. శత్రు వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసే ఈ వ్యూహాన్ని సీడ్ స్ట్రాటజీగా పేర్కొంటారు. మరింత వివరంగా చెప్పాలంటే.. సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సుగా దీన్ని పేర్కొంటారని చెబుతున్నారు. ఈ వ్యూహాన్ని అమలు చేయటం ద్వారా మన యుద్ధ విమనాల్ని శత్రువులు దెబ్బ తీసే అవకాశం తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
అంతేకాదు.. భారత వైమానిక దళం పాక్ గగనతలంలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవేశించేందుకు వీలు కలుగుతుంది. శత్రు గగనతలంపై పట్టు లభిస్తుంది. వాయుసేన సాయంతో సైన్యం సైతం ముందుకు దూసుకెళ్లేందుకు వీలవుతుంది. దీన్ని క్లోజ్ ఎయిర్ సపోర్టుగా వ్యవహరిస్తుంటారు. ఈ సీడ్ వ్యూహాన్ని తొలుత జర్మనీపై బ్రిటన్ ప్రయోగించి విజయం సాధించింది. లాహోర్ లో రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయటం ద్వారా పాక్ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాల్ని ఛేదించే క్షిపణులను మొహరించిన ప్రాంతాలపై దాడులు చేసే అవకాశం భారత్ కు లభిస్తుంది.భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న వేళ.. ఇరు దేశాల మధ్య సమస్యలు త్వరగా సమిసిపోవాలని.. ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం చేస్తామని అమెరికా చెబుతున్న వేళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా… ఎఫ్-16 యుద్ధ విమానం విషయంలో అమెరికాతో ఉన్న అగ్రిమెంట్ ను పాక్ ఉల్లంఘించింది!
అవును… ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ పై పాక్ దాడులకు తెగబడుతోంది. ఈ సమయంలో తాజాగా జమ్మూ లక్ష్యంగా పలు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అయితే.. వాటిని భారత్ విఫలం చేసింది. ఇదే సమయంలో ఎఫ్-16 యుద్ధ విమానం కూడా పాక్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది.. దీన్ని భారత్ అడ్డగించి నాశనం చేసింది.ఇదే సమయంలో పఠాన్ కోట్ సెక్టార్ లో పాకిస్థాన్ కు చెందిన రెండు ఫైటర్ జెట్లను సైన్యం కూల్చి వేసింది. ఇందులో ఎఫ్-16 యుద్ధ విమానం కూడా ఉంది. ఈ సమయంలో ఆ జెట్ లోని పైలట్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్-16 విషయంలో అగ్రరాజ్యం అమెరికాకు పాకిస్థాన్ అడ్డంగా దొరికేసిందని అంటున్నారు. దానికి పెద్ద కారణమే ఉంది.
వాస్తవానికి 1980 చివర్లో అమెరికా తయారు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానలను పాకిస్థాన్ అందుకుంది. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య వీటి వాడకంపై అగ్రిమెంట్ జరిగింది! ఇందులో భాగంగా.. ఉగ్రవాద నిరోధక, తిరుగుబాటు నిరోధక కార్యకలాపాల కోసం మాత్రమే ఈ ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించాలని అమెరికా కండిషన్ పెట్టింది.ఇదే సమయంలో… పాకిస్థాన్ వెలుపల ఎఫ్-16 విమానాలు లేదా మూడో దేశంతో ఉమ్మడి కార్యకలాపాల్లో పాల్గొనడానికి వాడాల్సి వస్తే అందుకు యూఎస్ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరమని కండిషన్ పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే… ఈ విషయంలో ఉన్న అన్ని కండిషన్స్ ను పాక్ ఉల్లంఘించి, భారత్ పై దాడికి యత్నించింది!
వాస్తవానికి ఈ ఎఫ్-16 కండిషన్స్ ని పాక్ 2019లోనే ఉల్లంఘించింది. అయితే.. నాడు దాడి చేసి తప్పించుకుంది! అయితే… ఈ సారి మాత్రం రెడ్ హ్యాండెడ్ గా దొరికేసింది. ఆ జెట్ నడిపిన పైలట్ కూడా దొరికేసిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది.. పాక్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని సుమారు రెండు వారాలుగా అవిరామంగా ఉల్లంఘిస్తున్న పాక్.. ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) నుంచి భారత్ పైకి డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు పంపే ప్రయత్నాలు చేసింది. భారత్ తిప్పి కొట్టింది.
పాక్ దాడులకు ప్రతీకారంగా కౌంటర్ ఎంటాక్స్ స్టార్ట్ చేసింది భారత్. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్, రావల్పిండిలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో… పాకిస్థాన్ సైన్యంపై విరుచుకుపడింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇందులో భాగంగా… బలుచిస్తాన్ నుంచి పాక్ ఆర్మీని తరిమికొట్టి.. క్వెట్టా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.అవును… మే 8 – 9 తేదీల మధ్య రాత్రి వేళ పలు భారతీయ నగరాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించింది. అయితే ఆ దాడిని భారత్ తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్స్ స్టార్ట్ చేసింది. ఈ గ్యాప్ లో బలూచిస్తాన్ లోని క్వెట్టాలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీ.ఎల్.ఏ) రంగంలోకి దిగింది. పాక్ సైన్యానికి షాకిచ్చింది!
ఈ సందర్భంగా… క్వెట్టాలోని పాకిస్థాన్ దళాల ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసిన తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజా నివేదికల ప్రకారం.. బలూచీ తిరుగుబాటుదారులు క్వేట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. పాక్ సైన్యాన్ని బయటకు నెట్టేశారు!కాగా.. పాకిస్థాన్ ప్రావిన్స్ బలుచిస్తాన్ రాజధాని క్వెట్టా అనే సంగతి తెలిసిందే. ఇది పాకిస్థాన్ లోనే తొమ్మిదో అతిపెద్ద నగరం. చుట్టూ పర్వతాలతో చుట్టుముట్టిన లోయలో ఉన్న ఈ ప్రాంతంలో అనేక పండ్ల తోటలు ఉంటాయి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉత్పత్తి కూడా ఎక్కువ కావడంతో.. ఈ నగరాన్ని “పాకిస్థాన్ పండ్ల తోట” అని కూడా పిలుస్తారు.