మే 10, శనివారం, అమెరికాలోని పెన్సిల్వేనియాలోని లాంక్ స్టర్ కౌంటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒహియోలోని క్లీవ్ ల్యాండ్ లో నివసిస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సౌరవ్ ప్రభాకర్ (23), మానవ్ పటేల్ (20) అని స్థానిక అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఘటనా స్థలంలోనే మరణించినట్లు ప్రకటించారు.
అవును… పెన్సిల్వేనియాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. ఈ ప్రమాదం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బెక్ నాక్ టూన్షిప్ లోని 286.5 మైలు సమీపంలో జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన పెన్సిల్వేనియా రాష్ట్ర పోలీసులు.. కారు రోడ్డు పక్కన అదుపు తప్పి, చెట్టును ఢీకొట్టి, ఆపై వంతెనను ఢీకొట్టిందని తెలిపారు.
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అత్యవసర బృందాలు అక్కడికి చేరుకున్నాయని.. అయితే, దురదృష్టవశాత్తు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన కాన్సులేట్ మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా… క్లీవ్ ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మానవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్ ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకర రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాము.. ఈ క్లిష్ట సమయంలో కాన్సులేట్ కుటుంబాలతో సన్నిహితంగా ఉంది.. వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.
మృతిచెందిన విద్యార్థులు క్లీవ్‌లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం ధృవీకరించింది. మృతులను మానవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్‌లుగా గుర్తించినట్లు కాన్సులేట్ అధికారులు వెల్లడించారు. క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీలో ఇద్దరు భారతీయ విద్యార్థుల విషాద మరణాలపై న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా “తీవ్ర విచారం” వ్యక్తం చేసింది. X పై ఒక ప్రకటనలో, కాన్సులేట్ విద్యార్థుల కుటుంబాలతో సన్నిహితంగా ఉందని, సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తున్నట్లు తెలిపింది.