ఏపీలో కల్తీ లిక్కర్ మీద రాజకీయ దుమారం రేగుతోంది. వాడవాడలా ఏకంగా దుకాణాలను తెరచి మరీ కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని వైసీపీ విమర్శిస్తొంది. దీంతో అధికార కూటమి అలెర్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నారు. ఆయన మంత్రులు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కల్తీ మద్యం వెనక ఎంతటి పెద్ద వారు ఉన్నా ఉపేక్షించొద్దు అని ఆర్డర్స్ జారీ చేయడం విశేషం.
చంద్రబాబు అధికారులతో నిర్వహించిన సమావేశంలో కల్తీ మద్యం విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తూ భయపెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రమంతటా కల్తీ మద్యం అమ్మకాలు ఉన్నాయని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఈ రకమైన తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని, అంతే కాదు కల్తీ లిక్కర్‌తో ప్రాణాలు పోతున్నాయని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని వారితో జాగ్రత్త అని అప్రమత్తం చేశారు.
ఏపీలో మద్యం మరణాల ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టండి అంటూ అధికారులకు బాబు ఆదేశాలు జారీ చేశారు. కేవలం రాజకీయ కుట్రతో మరణాలపై తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు అంతే కాదు వైసీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని మంత్రులకు కూడా బాబు సూచించారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీతో పాటు అమ్మకాలను ఏ మాత్రం ఉపేక్షించవద్దని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కల్తీ లిక్కర్‌తో ప్రజల ప్రాణాలను హరించే వారిపై కఠిన చర్యల ద్వారా ఉక్కుపాదం మోపాలని బాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక గడచిన 15 నెలలలో పటిష్ట చర్యల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టామని ఆయన గుర్తు చేశారు. ఇదే తీరున అధికారులు సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రంలో కల్తీ లిక్కర్ అనేది లేకుండా చేయాలని ఆదేశించారు.
ఏపీలో ఏ మూలన అయినా లేక ఏ ఒక్క ప్రాంతంలో అయినా కల్తీ లిక్కర్ తయారీ కేంద్రాలు కానీ వాటికి సంబంధించిన వ్యక్తులు కానీ ఉండకూడదని బాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు. ఈ విషయంలో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీస్ శాఖలు పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కల్తీ లిక్కర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన బాబు అదే సమయంలో దీని మీద జరుగుతున ఫేక్ ప్రచారం మీద ఒక కన్ను వేయాలని కోరారు కల్తీ లిక్కర్ వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనం కోసం కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మూడు బాటిల్స్‌లో ఒక బాటిల్ కల్తీ లిక్కర్ బాటిల్ ఉందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని, అదే విధంగా రాష్ట్రంలో కల్తీ లిక్కర్‌తో ప్రాణాలు పోతున్నాయనిప్రచారాలు మొదలు పెట్టిన విషయాన్ని మంత్రులు కూడా అర్థం చేసుకోవాలని బాబు సూచించరు. అంతే కాదు వైసీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని సూచించారు.