ఇటీవల పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీపెద్దలు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో.. చిరంజీవి, నాగార్జునతో పాటు రాజమౌళి, దిల్ రాజు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెళ్లడించారు. అవును… పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా… ఉదయం సినిమా విడుదలయ్యిందంటే అదే రోజు సాయంత్రానికల్లా ఆ సినిమాను వెబ్ సైట్ లో పెట్టి, ప్రజలందరినీ ఆకట్టుకునేవాడని తెలిపారు.
విశాఖపట్నానికి చెందిన రవికి మొదటి నుంచీ క్రిమినల్ మైండ్ సెట్ ఉందని అన్నారు. ఇతడు బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడని.. వేరే వేరే పేర్లతో మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని అన్నారు. ఈ వెబ్ సైట్ పై అప్రమత్తమైన సినీరంగం ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు అతని వెంటపడ్డారని తెలిపారు. దీంతో, అతడు భారత పౌరసత్వాన్ని వదిలి, కరేబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడని.. ఈ క్రమంలో ఫ్రాన్స్ లో ఉంటూ వివిధ దేశాలు తిరిగేవాడని అన్నారు. 2019లో ఐబొమ్మ ప్రారంభించి 21 వేల సినిమాలు పైరసీ చేశాడని తెలిపారు.
దీనికోసం అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్ దేశాల్లో తిరిగాడని, సర్వర్లు పెట్టాడని, వీటికోసం 101 డొమైన్లు కొన్నాడని.. వీటిలో ఒకదాన్ని బ్లాక్ చేస్తే మరొకటి ఓపెన్ చేశాడని తెలిపారు. ఇతడు వెబ్ సైట్ డిజైన్, డెవలపింగ్, హోస్టింగ్ లో చాలా ఎక్స్ పర్ట్ అని.. ఈ విద్య నేర్చుకుని ఐబొమ్మ, బప్పం టీవీని ఏర్పాటు చేశాడని వెల్లడించారు. ఈ పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగిందని.. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున సమస్య ఈ పైరసీ అని.. దీనిపై హైదరాబాద్ సిటీ పోలీస్, సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ పైరసీ ముప్పును అరికట్టాలనే ధృడమైన సంకల్పంతో పనిచేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ, బెప్పం టీవీ మాస్టర్ మైండ్ ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసుతో పాటు అతడిపై ఇంకా ఐటీ యాక్ట్, కాపీ రైట్ యాక్ట్ కింద మరో నాలుగు కేసులు నమోదు చేయబడ్డాయని తెలిపారు. ఇతడి కంటే ముందు దుద్దెల శివరాజు, సుచర్ల ప్రశాంత్ ను అరెస్ట్ చేసి.. వారి నుంచి ఎంతో కీలక సమాచారం రాబట్టినట్లు పేర్కొన్నారు. ఈ పైరసీ వల్ల ఇండస్ట్రీకి నష్టం ఒకెత్తు అయితే.. వీటి ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ప్రజలకు నష్టం కలిగించారని అన్నారు.
ఇమ్మడి రవికి సంబంధించిన ఈ ఐబొమ్మ, బప్పం టీవీ లకు సంబంధించిన వెబ్ సైట్ లను ఒకదాన్ని బ్లాక్ చేస్తే, మరొకటి యాక్టివేట్ చేశాడని.. ఈ క్రమంలో అతని వద్ద 65 మిర్రర్ వెబ్ సైట్ ఉన్నాయని అన్నారు! అతని వద్ద ఉన్న హార్డ్ డిస్క్ లో 21 వేల సినిమాలు ఉన్నాయని సజ్జనార్ వెల్లడించారు. వాటిలో 1972లో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకూ కూడా అతని హార్డ్ డిస్క్ లో ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో సుమారు రూ.20 కోట్లు అతడు సంపాదించాడని.. అందులో రూ.3 కోట్లు సీజ్ చేయడం జరిగిందని.. ఈ సమయంలో అతని ఫైనాన్షియల్ వ్యవహారల గురించి తెలుసుకోవడానికి పోలీస్ కస్టడీ అడగడం జరిగిందని వెల్లడించారు. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ లింకులు ఉన్నందుకు సీబీఐ, ఈడీ అధికారులను అప్రమత్తం చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకూ అతడి వద్ద 50 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ డేటా ఉందని వెల్లడించారు.


















