పూరి మ్యూజింగ్స్ పేరుతో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రపంచంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుగువారికి పరిచయం చేస్తున్నారు. తాజాగా హ్యూమన్ లైబ్రరీ అనే టాపిక్ పై అతడు చెప్పిన చాలా విషయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి లైబ్రరీ అంటే దాని నిండా పుస్తకాలు ఉంటాయి. కానీ హ్యూమన్ లైబ్రరీ అంటే అక్కడ కేవలం మనుషులు మాత్రమే ఉంటారు. అక్కడ మనుషుల్ని చదువుకునేందుకు రీడర్ లేదా ప్రజలు వెళ్లొచ్చు.
హ్యూమన్ లైబ్రరీలో మనుషులంతా వారి వారి అనుభవాలను ప్రజలకు షేర్ చేసుకుంటారు. వారి అనుభవాలు నచ్చితే వారితో సంభాషణను కొనసాగించవచ్చు. అయితే దీనికి ఒక నియమం ఉంది. అక్కడ 30 నుంచి 60 నిమిషాలు మాత్రమే విజిటర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. డెన్మార్క్ రాజధాని కోహెన్ హెగన్ లో మొట్టమొదటి హ్యూమన్ లైబ్రరీ 2000లో మొదలైంది. 80 దేశాలకు పైగా విస్తరించింది. మనిషే పుస్తకమై తమ అనుభవాలను ప్రజలతో పంచుకోవడం అనే అరుదైన కాన్సెప్ట్ పెద్ సక్సెసైంది. నచ్చిన వారి నుంచి మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చనే ఆచారం బావుంది.
ప్రపంచంలోని విభిన్నమైన మనుషులంతా ఇక్కడ ఉంటారు. హెచ్ ఐవి సోకిన వారు, మానసిక రోగులు, ఒంటరితనం అనుభవించేవారు, రకరకాల అనుభవాలతో రాటు దేలిన ఎందరితోనో మాట్లాడే అవకాశం ఇలాంటి చోట లభిస్తుంది. ఇలాంటి హ్యూమన్ లైబ్రరీలో మన దేశంలోను ఉన్నాయి. ముంబై, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి చోట్ల హ్యూమన్ లైబ్రరీలు ఉన్నాయి. వీలుంటే ఒకసారి ఇలాంటి లైబ్రరీని సందర్శించి రండి! అని పూరి జగన్నాథ్ తన మ్యూజింగ్స్ లో చెప్పారు.