ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముంబైలో చిత్రీకరణ ప్రారంభించిన యూనిట్ నాటి నుంచి శర వేగంగా చిత్రీకరణ జరుపుతోంది. అవసరం మేర బన్నీ మినహా మిగతా టీమ్ అంతా షూటింగ్ లోనే బిజీగా ఉంది. టెక్నికల్ స్టాండర్స్డ్ తో మిళితమైన కథ కావడంతో? ప్రఖ్యాత న్యూయార్క్ స్టూడియోలు సినిమా కోసం పని చేస్తున్నాయి. బన్నీ సినిమాలో నాలుగు పాత్రలు పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది.
హీరో విలన్ సహా మరో రెండు కీలక పాత్రల్లో బన్నీ కనిపించనున్నట్లు తెలుస్తోంది. కథలో అట్లీ మార్క్ యాక్షన్ ..సందేశం అంతే హైలైట్ అవుతుంది. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ని రంగంలోకి దించారు. ఈ నేపథ్యంలో తాజాగా యాక్షన్ సీన్స్ కి సంబంధించి కొత్త అప్ డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో మార్షల్ ఆర్స్ట్ యాక్షన్ నేపథ్యం గల సన్నివేశాల్లో అలరించనున్నారని వినిపిస్తుంది. ప్రత్యేకించి ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయని చిత్ర వర్గాల నుంచి లీకైంది.
ఈ సన్నివే శాల్లో బన్నీని ఓ హాలీవుడ్ హీరో రేంజ్లో నే హైలైట్ చేయబోతున్నారుట. భారీ భవంతలు నుంచి దూకే సన్నివేశాల్లో కనిపించనున్నాడుట. ఈ సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గానూ ప్లాన్ చేస్తున్నారుట. ఎలాంటి డూప్ లేకుండా బన్నీనే స్వయంగా ఈ సన్నివేశాల్లో నటిస్తాడని లీకులందుతున్నాయి. అన్ని రకాల భద్రతతో తానే రంగంలోకి దిగాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తొలుత ఈసన్నివేశాలను అట్లీ డూప్ తో చేద్దామన్నాడుట. కానీ బన్నీ అందుకు అంగీకరించలేదని…తానే స్వయంగా వాటిలో పాల్గొంట నని చెప్పడంతో? బన్నీ కమిట్ మెంట్ అర్దమవుతుంది.
ఈ సన్నివేశాలను న్యూయార్క్ లో షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారుట. ఏ ఐ టెక్నాలజీ- స్టూడియోస్ లో కాకుండా రియల్ లొకేషన్స్ అయితే ప్రేక్షకుడికి గొప్ప అనుభూతి కలుగుతుందని అట్లీ అండ్ కో అలా ప్లాన్ చేస్తున్నారుట. బన్నీతో యాక్షన్ సన్నివేశాలంటే అందులో స్టైలిష్ యాక్షన్ ఇవ్వడం అతడికే చెల్లింది. యాక్షన్ సన్నివేశాలు ఎంత మంది స్టార్లు చేసినా? బన్నీయాక్షన్ మాత్రం ప్రేక్షకులకు ప్రత్యేకం. ఆ స్టైల్ కి అట్లీ తోడైన నేపథ్యంలో స్టైలింగ్ మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది.