లండన్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు.మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్
ఎన్ఆర్ఐ యూకే బీఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు..ఎన్నారై సెల్ చైర్మన్ అనిల్ కుర్మాచలం లేని లోటు కనిపిస్తున్నది..2012 – 13 లో నేను మొదటిసారి వచ్చినప్పుడు అనిల్ మొదటి ఎన్ఆర్ఐ మీటింగ్ నాతోని ఇక్కడ ఏర్పాటు చేశారు.ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ పార్టీ మొదట పుట్టిందే లండన్ లో… యూకే ఎన్నారైల వల్లే ప్రపంచవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ వ్యాప్తి చెందింది.మన సంస్కృతి, సాంప్రదాయాలు, బతుకమ్మ లాంటి పండుగలను ప్రపంచానికి చాటి చెప్పింది కూడా ఇక్కడి నుండి..తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో మేము నిరసన కార్యక్రమాలు, ఉద్యమాన్ని చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని ఈ గడ్డపై కూడా చేసింది మీరే..కేసీఆర్ కి మద్దతిచ్చి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మీ అందరికీ తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించింది.అప్పుడు దేశంలో నానుడి ఉండేది. బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని ఉండేది..కానీ కెసిఆర్ గారి పాలనతో తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని కాడికి తెచ్చాం..గత 10 ఏండ్లలో.. గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది పర్ క్యాపిటా ఇన్కమ్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది.పర్ క్యాపిటా పవర్ వాడకంలో ఇండియాలో తెలంగాణ టాప్.జీఎస్డీపీ గ్రోత్ లో తెలంగాణ రాష్ట్రానికి దరిదాపులో కూడా ఏ రాష్ట్రం లేదు.ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు నల్ల ద్వారా అందించింది కేసీఆర్ గారు.మ్యానిఫెస్టోలో పెట్టుకోకపోయినా ఇంటికి తాగునీరు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్.అసెంబ్లీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్ల ద్వార నీళ్ళియకపోతే ఓట్లు అడగను అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించి చూపించారు. మిషన్ భగీరథ కార్యక్రమంతో.తెలంగాణ రాకముందు హైదరాబాదులో ఇండస్ట్రీస్ కి పవర్ హాలిడేస్ ఇచ్చేవారు. 4 గంటలకు కరెంటు కట్టు ఉండేది. గ్రామీణ ప్రాంతంలో 6 గంటల నుంచి 8 గంటల పవర్ కట్ ఉండేది.అరవై ఏళ్లలో కాని పనిని కేసీఆర్ ఒక్క సంవత్సరంలో సాధించి 24 గంటల నాణ్యమైన కరెంటును ఇచ్చారు.టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కెసిఆర్ ఉదయం లేవగానే పవర్ పై సమీక్ష చేసి పవర్ కొనుగోలు టైమ్స్ ని చూసేవారు.తర్వాత మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవాడు.డెడికేషన్ గా పనిచేసేవారు. ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని సర్దార్ కోచలాని కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.పదేండ్లయినా కూడా భారతదేశంలో హర్ ఘర్ జల్ పూర్తి కాలేదు కానీ మూడు ఏండ్లలో మిషన్ భగీరథను పూర్తి చేసుకున్నాం.
మిషన్ కాకతీయ మనందరం ఎక్కడో ఏదో గ్రామం నుంచి వచ్చిన వారమే.. మన ఊర్లలో ఉండే చెరువుluఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైంది..చెరువుల్లో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది వ్యవసాయం తాగునీరు అందుతాయి..దాదాపు 30 వేల చెరువులను మూడు సంవత్సరాల్లో రిజిస్టర్ చేసాం.. ఈ కార్యక్రమం మొత్తం దేశం దృష్టినే ఆకర్షించింది.కేంద్రం అమృత సరోవర్ కార్యక్రమాన్ని చేపట్టి అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి అధికారులను పంపించింది.రైతుల కోసం దేశంలోనే నేరుగా నగదు బదిలీ చేసిన ఒకే ఒక కార్యక్రమం రైతుబంధు..వాచ్మెన్ జాబ్ చేసినా పిల్లని ఇస్తారు కానీ రైతు అని అంటే పిల్లని ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. వ్యవసాయం అంటే చిన్నచూపు అయింది.అలాంటి పరిస్థితుల నుండి కేసీఆర్ గారు రైతుబంధు అని ఒక కార్యక్రమం చేపట్టి.. ప్రతి సంవత్సరం 10000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు.
24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వ్యవసాయానికి అందించారు..సాగునీరుని అందించాము దాని ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారింది.2014కి ముందు ఎక్కడ చూసినా రెండు మూడు లక్షలకు మించి ఎకరం ఉండేది కాదు..ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కూడా 30 నుండి 50 లక్షల ఎకరం తక్కువ లేదు..ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి పీఎం కిసాన్ అని చేపట్టింది..విద్యుత్ వినియోగమైనారోడ్ ట్రాన్స్పోర్ట్ అయినా, ఏ కార్యక్రమమైనా తెలంగాణ దేశానికి ఆదర్శం..భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేసి ఉండరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7.7% గ్రీన్ కవర్ ని పెంచి ఇండియాలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది.గ్రీన్ కవర్ పెంచడం ద్వారా ఓట్లు రావు. జనరల్గా రాజకీయ నాయకులు పచ్చదనంపై దృష్టి సాధించరు. కానీ భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్.అదేవిధంగా ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దారు.
ఎలక్షన్ల ముందు ఒక ఆయన కెసిఆర్ 24 గంటలు కరెంటు ఇచ్చిండు నేను 48 గంటలు కరెంటు ఇస్తా అని చెప్పిండు..ఎన్నికల ముందు ఏది పడితే అది మాట్లాడారు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తున్నారు కదా మేము తులం బంగారంతో పాటు లక్ష రూపాయలు ఇస్తామన్నారు..ఒకరోజు నా దగ్గరికి పంచాయతీ సెక్రటరీలు వచ్చారు.. మాకు చాలా ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. గ్రామపంచాయతీలో డబ్బులు రాక అప్పుల పాలయ్యాము. ట్రాక్టర్లో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేదు అని చెప్పారు..అంటే నేను అడిగాను మీరు పంచాయతీ సెక్రెటరీలుగా ఉద్యోగాలు ఎవరిచ్చారు అని అడిగాను.. వారు చెప్పారు కేసీఆర్ గారు ఇచ్చారు ఒకేసారి 10000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పారు..ట్రాక్టర్ లోన్ ఇచ్చారు కేసీఆర్.. సెక్రటరీలకు పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? కేసీఆర్. మరి ఎందుకు మమ్మల్ని ఓడించారు అని అడిగాను..
మాకు ఎట్టా తెలుసు అన్న మీ విలువ. తెలంగాణ వచ్చినంక మీరే నేరుగా గవర్నమెంట్ లోకి వచ్చారు.. వేరే వాళ్ళు ఇంకేమన్నా బాగా చేస్తారేమో అని అనుకున్నాము. కాబట్టి ఇప్పుడు మాకు తెలిసిందన్నా పాలేవో నీళ్లేవో అని చెప్పారు.మాకు ఇతర ప్రభుత్వాలతో మిమ్మల్ని పోల్చే అవకాశం లేకుండా పొరపాటు చేశామన్న అని అన్నారు..ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేది అని అనేవారు.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో పది ఎకరాలు కొనవచ్చు..ఇప్పుడు 10 లక్షలు తక్కువకు అమ్ముదామంటే ఎవరూ కొనేవాళ్లు లేకుండా పోయింది.ఒక పాజిటివ్ ఆటిట్యూడ్ లేకపోవడం..కెసిఆర్ గారు తెలంగాణ ఓ గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి జరుగుతున్నది అని చెప్పేవారు.ఈరోజు పాలకులే నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది.ఈ సందర్భాల్లో మనం కూడా చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని కూడా మేము సరి చేసుకుని అందుకు వెళ్తున్నాం.హెల్త్ లో కూడా మదర్ అండ్ చైల్డ్ మరణాల రేట్ తగ్గిస్తూ దేశంలో మూడో స్థానంలో వచ్చాము.
టిఆర్ఎస్ ఉండి ఉంటే ఈపాటికి నెంబర్వన్ అయ్యేవారు.ఇప్పుడున్న ప్రభుత్వం పర్ఫామెన్స్పై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టి సారించడం దురదృష్టం.తెలంగాణలో ఈరోజు అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఏ శాఖలో చూసిన అవినీతి పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.కాళేశ్వరం అంటే లక్ష లక్ష కోట్ల రూపాయలు పోయాయని దుష్ప్రచారం..కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్ లు, 21 పంపు హౌస్ లు, 203 కిలోమీటర్ల టన్నెలు, 1500 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ 600 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడం..గత సంవత్సరం ఈ సంవత్సరం మంచి వర్షపాతం ఉండె.ఎస్సారెస్పీ నుండి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయి.. కాళేశ్వరం మోటర్లను మిడ్ మానేరు నుండి ఆపరేట్ చేస్తాం.37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తాయి.
యావరేజ్ రైన్ ఫాల్ ఉన్న ఇయర్లో ఎల్లంపల్లి నుండి కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసుకుంటే అక్కడినుంచి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.బ్యాడ్ ఇయర్.. ఎక్కడ వర్షపాతం లేకున్నా మేడిగడ్డ వద్ద నీళ్లు ఉంటాయి.. ఎంత క్రైసిస్ వచ్చినా అక్కడ నీళ్లు ఉంటాయి..37 లక్షల ఎకరాలకు సాగునీరు 60% తెలంగాణకు తాగునీరు. 60 టీఎంసీలు ఇండస్ట్రీకి.కాళేశ్వరంలో 141 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం ఉంది.50 టీఎంసీలతో మల్లన్న సాగర్.. ఇక్కడినుండి మూసికి నీళ్లు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి అన్నాడు..7000 కోట్లతో టెండర్లు కూడా పిలిచారు.మల్లన్న సాగర్ కూలిపోతే కాళేశ్వరం నీళ్లను మూసికి ఎలా తీసుకెళ్తావు రేవంత్ రెడ్డి..గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశావు.. అక్కడికి సోర్స్ కాళేశ్వరం మల్లన్న సాగరే కదా..ఉత్తంకుమార్ రెడ్డి గారు కాళేశ్వరం లేకున్నా రికార్డ్ పంట పండింది అని అంటున్నారు.నేను ఉత్తంకుమార్ రెడ్డి గారిని అడిగాను. మీ ప్రభుత్వం వచ్చాక ఒక చెరువు దగ్గర ఒక చెక్ డ్యాం కట్టారా? ఒక ప్రాజెక్టు కట్టారా?ఒక ఎకరానికి అయినా నీల్లు ఇచ్చారా అని అడిగాను..
మరి ఎలా పంట సాధ్యమైంది.. పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన కృషి వల్ల ఇంత పంట పండింది..కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇంపాక్ట్ ఉంది.. కేవలం మూడు బ్యారేజీల్లో ఒక్క బ్యారేజీలో మాత్రమే మూడు పిల్లర్లు కుంగాయి..అసెంబ్లీలో ఎమ్మెల్సీ కోదండరాం గారు అన్నారం సుందిళ్ల ప్రాజెక్టు గురించి ప్రశ్న అడిగితే అన్నారం సుందిళ్లలో ప్రాజెక్టులు బాగున్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జవాబు ఇచ్చారు.ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటారు… బ్లాక్ సెవెన్ ఒకటి రిప్లై చేసి కట్లే సరిపోతుందని చెప్పింది..కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలోనే కూలిన కడెం, ఎల్లంపల్లి, పెద్దవాగు ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి…మూడు నాలుగు వందల కోట్లలో మేడిగడ్డ రిపేర్ అయిపోతుంది. కానీ లక్ష కోట్లు అని దుష్ప్రచారం చేస్తుంది కాంగ్రెస్.రాష్ట్ర ప్రయోజనాలు రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదు.
Deferred Live from UK: Former Minister @BRSHarish speaking at Meet and Greet Program. https://t.co/M82WHwUyH8
— Office of Harish Rao (@HarishRaoOffice) September 5, 2025