పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భీమ్లా నాయక్ తర్వాత సుమారు మూడేళ్ల విరామం అనంతరం వచ్చిన సినిమా హరిహర వీరమల్లు. అభిమానులను అలరిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ సినిమాని మరింత జనరంజకంగా మార్చడం కోసం కొంత నిడివి తగ్గించి మరింత ఉద్వేగభరితంగా తీర్చిదిద్దారు మేకర్స్. తాజాగా ఈ ట్రిమ్డ్ వెర్షన్ ని ప్రేక్షకులను మరింత అలరిస్తుందని భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మరోసారి ఈ ట్రిమ్డ్ వెర్షన్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సీట్ ఎడ్జ్ ఫైట్ ను స్వయంగా పవన్ కళ్యాణ్ కంపోజ్ చేయడం అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఆనాటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తూనే పవన్ కళ్యాణ్ సహజ సిద్ధమైన మార్షల్ ఆర్ట్స్ మేళవించిన తీరు అమోఘం అని చెప్పాలి. ఈ హరిహర వీరమల్లు సినిమాకి నాంది పలికిన డైరెక్టర్ క్రిష్ సినిమాని థియేటర్లలో చూసి సామాజిక మాధ్యమాలలో మెచ్చుకోవడం గమనార్హం. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో మరిన్ని సినిమాలు చేయడానికి ఎదురుచూస్తున్నానని చెప్పిన మాటలు చూస్తుంటే సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టమవుతోంది.