టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమా.. నాలుగు రోజుల క్రితం థియేటర్స్ లో విడుదలైంది. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు మేకర్స్.. ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఇప్పుడు పలు మార్పులు చేశారు.
నిజానికి హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ సినిమాపై వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను సీరియస్ గా పరిగణిస్తామని స్పష్టం చేశారు. వీఎఫ్ ఎక్స్ లోపాలను కూడా సరి చేస్తామని తెలిపారు. చెప్పినట్లుగానే కొన్ని వీఎఫ్ ఎక్స్ షాట్స్ ను సరి చేశారు. మేకర్స్. అంతే కాదు.. సెకండాఫ్ నిడివిని కొంత భాగం కూడా తగ్గించారు.
సినిమాను ట్రిమ్ చేశామని, అప్‌డేట్ చేసిన కంటెంట్ ను రీలోడ్ చేశామని మేకర్స్ అధికారికంగా ధ్రువీకరించారు. ట్రిమ్ చేసిన క్లైమాక్స్ తో కూడిన హరి హర వీర మల్లు కొత్త వెర్షన్ ఇప్పటికే థియేటర్స్ ప్రదర్శిస్తున్నారు మేకర్స్. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ లలో సాధారణ టికెట్ల ధరలు అమల్లోకి వచ్చేశాయి. సినిమా విడుదల సందర్భంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దీంతో పెంచిన టికెట్ ధరలను అందుబాటులో ఉన్నాయి. జులై 28వ తేదీ నుంచి సాధారణ ధరలకే వీరమల్లు టికెట్లు లభిస్తున్నాయి. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో రేట్స్ మారాయి.
సోమవారం నుంచి ఎలాంటి పెంపు లేకుండా సాధారణ ధరకే టికెట్లు విక్రయిస్తున్నారు. అయితే వీఎఫ్ ఎక్స్ షాట్స్ ను సరిచేయడంతోపాటు టికెట్ ధరలు తగ్గించారు మేకర్స్. అదే సమయంలో వాటి పైనే భారం వేశారు. ఎందుకంటే స్టార్ విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ కింగ్డమ్.. మరో మూడు రోజుల్లో థియేటర్స్ రిలీజ్ లో కానుంది. స్పై జోనర్ లో రూపొందిన ఆ సినిమా.. జులై 31వ తేదీన విడుదల అవ్వనుంది. అందుకే ఆదాయాన్ని పెంచడానికి థియేటర్లకు జన సమూహాన్ని రప్పించడానికి చేసిన మార్పుల పైనే ఆధారపడ్డారు మేకర్స్. ముఖ్యంగా కింగ్డమ్ కు పాజిటివ్ టాక్ వస్తే.. ఆడియన్స్ దృష్టి అటువైపే పడుతుంది. అందుకే ఈ లోపలే మార్పులను మేకర్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఎంత వరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.