నేహా శెట్టి..ఈ పేరు కంటే ఎక్కువగా రాధిక అనే పేరుతోనే వైరల్ అయింది.. ఈమె పోషించిన రాధిక అనే క్యారెక్టర్ మీద పాట కూడా పాడేశారు. అలా ‘డీజే టిల్లు’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ బ్యూటీగా మారిపోయిన నేహా శెట్టి కెరియర్ ఈ సినిమాతో మారిపోయిందని చెప్పుకోవచ్చు. అప్పటివరకు ఈ బ్యూటీ నటించిన సినిమాలేవి అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. ఎప్పుడైతే డీజే టిల్లు సినిమాలో నటించిందో అప్పటినుండి నేహ శెట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. టిల్లు స్క్వేర్ మూవీలో కూడా చిన్న గెస్ట్ రోల్ పోషించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా అభిమానులకి చాలా దగ్గరగా ఉంటుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో చిట్ చాట్ చేస్తూ తన గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటుంది. అయితే గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ సందడి తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా ఈ హీరోయిన్ కి సంబంధించిన కొత్త ఫోటోలు ఏవీ అభిమానులతో పంచుకోవడం లేదు. దాంతో చాలామంది నెటిజన్లు ఇదేంటి టిల్లు గాడి లవర్ మరీ అంత బిజీ అయిపోయిందా.. కనీసం ఒక్క ఫోటో కూడా వదలడం లేదే అని అభిమానులు అనుకోవడమే ఆలస్యం.. ఫటాఫట్ ఓ నాలుగైదు ఫోటోలు వదిలేసింది. ఆ ఫోటోలు కుర్రకారుకు ఈ చల్లటి వెదర్ లో హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా నేహ శెట్టి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిగా.. ఆ ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంది. ఇక ఈ ఫొటోస్ అన్ని నేహా శెట్టి రాత్రిపూట తీసుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి.ఇక ఆ నల్లటి చీకట్లో నేహ శెట్టి అందం మిరుమిట్లు గొలుపుతోంది..
అలా తాజాగా మాల్దీవ్స్ రిసార్ట్ లో దిగిన ఎన్నో హాట్ ఫోటోలను ఇన్స్టా వేదికగా తన అభిమానులతో పంచుకుంది నేహా శెట్టి.. స్లీవ్ లెస్ గోల్డెన్ షైన్ మ్యాక్సీవేర్ లో ఈ బ్యూటీ ఘాటు ఫోజులిచ్చింది.పైగా మిడ్ నైట్ వాక్ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. నేహా శెట్టి పెట్టిన ఒక్కొక్క ఫొటోకి లక్షల లైకులు వేల కామెంట్లు వస్తున్నాయి.. ఆమె వేసుకున్న ఆ గౌను మొత్తం లైటింగ్ తో తెగ మెరుస్తోంది.. డ్రెస్ కు తగ్గట్టే నేహ శెట్టి ఫేస్ కూడా వెలిగిపోతోంది. ఈ ఫొటోస్ నేహా శెట్టి పార్టీ వైబ్ ని తెలుపుతున్నాయి.. ఈ ఫోటోలు చూసిన చాలా మంది అభిమానుల్లో ముఖ్యంగా అబ్బాయిల్లో హీట్ పుట్టిస్తున్నాయి.. అలా నేహా శెట్టి హాట్ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
నేహా శెట్టి సినిమాల విషయానికి వస్తే..పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరితో మెహబూబా అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత గల్లి రౌడీ,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలు చేసింది. మూడు సినిమాలు చేసినా రాని గుర్తింపు డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ లో వచ్చేసింది. ఈ మూవీలోని రాధిక పాత్రకి చాలామంది ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారు.అలా నేహా శెట్టి ఎక్కడ కనిపించినా ఆమెను అసలు పేరు కంటే రాధిక అనే పేరుతో ఎక్కువమంది గుర్తుపట్టడమే కాకుండా అదే పేరుతో పలకరిస్తారు కూడా. ఇక డీజే టిల్లు మూవీ తర్వాత బెదురులంక 2012, కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్,విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలు చేసింది. ఇక నేహా శెట్టి కొత్త సినిమాలకి సంబంధించిన కబుర్లేవి ఈ మధ్య వినిపించడం లేదు.
Glam and sparkles everywhere ft@iamnehashetty
. . #NehaShetty #NehaSshetty pic.twitter.com/WTAfOHpvfO— news7telugu (@news7telug2024) September 1, 2025