సోషల్ మీడియా ప్రభావం ఈ రోజుల్లో ఎక్కువగా ఉండటం వలన ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతున్నారో ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా ఫన్నీగా కనిపిస్తాయి. అయితే ఆ వీడియోని చూసినప్పుడు చాలామంది ముందు నవ్వుకోవడం మొదలుపెడతారు. ఈ ప్రాసెస్లో కొంతమంది కామెంట్ కూడా చేస్తారు. అలా కామెంట్ చేయడం వలన ఆ వీడియోకి రీచ్ ఎక్కువగా వెళ్లి ఇంకో పదిమందికి కనిపిస్తుంది.
మొత్తానికి ఏ అడ్రస్ లేని వాళ్ళు కూడా నేడు సెలబ్రిటీస్ అయిపోతున్నారు. అలానే సెలబ్రిటీస్ గా కొన్ని సినిమాలు చేసిన వాళ్లు కూడా ఇప్పుడిప్పుడు ఫేమస్ అవుతున్నారు. ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేస్తూ కొంతమేరకు గుర్తింపు సాధించుకున్న వాళ్లు కూడా ఈ మధ్య విపరీతమైన గుర్తింపు దక్కించుకున్నారు. కారణం లేకుండానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలా రీసెంట్ టైమ్స్ లో వైరల్ అయ్యారు మరాఠీ నటి గిరిజ ఓక్.
మరాఠీ నటి గిరిజ ఓక్ చాలా సినిమాల్లో కనిపించారు. అయితే ఆ సినిమాలేవి కూడా గిరిజ ఓక్ కు విపరీతమైన గుర్తింపును తీసుకురాలేదు. అమీర్ ఖాన్ నటించిన తారా జమీన్ పర్ సినిమాలో కూడా ఈవిడ నటించారు. ఇక రీసెంట్ టైమ్స్ లో గిరిజ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గిరిజ వీడియో వైరల్ అవుతుంది అని బహుశా ఊహించుకోవడం ఉండదు. ఏకంగా గిరిజ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన టీచర్ గురించి ఒక ఫన్నీ సంఘటనను షేర్ చేసింది. అలా షేర్ చేయటం అనేది బహుశా ఎవరికంటోపడి వీడియోను షేర్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈవిడ ఎవరు అని వెతుక్కుని మరి ఫోటోలు డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అక్కడితో సోషల్ మీడియానే ఈమె ఫోటోలు , వీడియోలు షేక్ చేస్తున్నాయి.
గిరిజ ఎన్నో సినిమాలు చేశారు. అలానే తెలుగు నటుడు సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించిన షోర్ ఇన్ ది సిటీ వంటి సినిమాలోనూ నటించింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ తో ఈవిడకి ఒక లిప్ లాక్ సీన్ కూడా ఉంటుంది. ఇది కంటపడిన తర్వాత తెలుగు యువత ట్విట్టర్ లో దీనిని హైలెట్ చేయడం కూడా మొదలుపెట్టారు.
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జవాన్ లో కూడా కీలక పాత్రలో కనిపించారు. వెండితెరకే కాకుండా, బుల్లితెరపైనా గిరిజా కనిపిస్తూ తనకంటూ కొంతమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలానే కొన్ని వెబ్ సిరీస్ కూడా చేశారు. మొత్తానికి ఇప్పుడు ఈమె పాపులర్ అవడం అనేది సడన్ గా జరిగిపోయింది. ఇప్పుడు దీనిని పరిగణలోకి తీసుకొని తెలుగు ఫిలిం దర్శక నిర్మాతలు కూడా ఈవిడ డేట్లు పట్టుకొని సినిమాలు చేస్తారేమో చూడాలి.

















