స్వీటీ అనుష్క ఆఫ్టర్ టూ ఇయర్స్ వస్తున్న సినిమా ఘాటి. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ లాక్ చేశారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించారు. అనుష్క కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేసిన ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా ఘాటి వస్తుంది. ఐతే ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా కూడా సినిమా ప్రమోషన్స్ లో అనుష్క ఎక్కడ కనిపించట్లేదు. డైరెక్టర్ క్రిష్ ఒక్కడే బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కనిపించాడు.
అనుష్క వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొంటేనే సినిమా గురించి అందరికీ తెలుస్తుంది. స్వీటీ అనుష్క ఫ్యాన్స్ కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నారు. అసలే ఈమధ్య స్టార్ సినిమాలు కూడా సరైన ప్రమోషన్స్ ఉంటేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ప్రమోషన్స్ లేని సినిమాలను ఆదరించే పరిస్థితి కనిపించట్లేదు. ఘాటు అనుష్క ప్రమోషన్స్ కి వస్తుందా లేదా అన్న క్లారిటీ లేదు.
ఇప్పటివరకు ఘాటికి సంబంధించిన ఏ ఈవెంట్ కి అనుష్క కనిపించలేదు. సెప్టెంబర్ 5 అంటే ఇంకా 10 రోజుల్లో రిలీజ్ అవుతున్న సినిమాకు ఇలా ప్రమోషన్స్ లేకపోవడం కచ్చితంగా రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. సెప్టెంబర్ 5న అనుష్క ఘాటి తో సత్తా చాటాలని చూస్తుంది. అనుష్క నుంచి వస్తున్న మరో పవర్ ఫుల్ మూవీ ఘాటి. ఐతే తన లుక్ విషయంలో మార్పుల కోసం అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది.
రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది అనుష్క. ఆ తర్వాత ఘాటినే చేసింది. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క వేదం సినిమాలో నటించింది. ఆ సినిమాలో సరోజ పాత్రలో అదరగొట్టేసింది. ఇన్నాళ్లకు మళ్లీ క్రిష్ తో ఘాటి సినిమా చేసింది అనుష్క. క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా నుంచి బయటకు వచ్చి ఘాటిని పూర్తి చేశారు. ఈ సినిమాతో ఆయన కూడా తన మార్క్ చూపించాలని చూస్తున్నారు.
ఘాటి సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించారు. ఐతే ఈ సినిమాకు పోటీగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి మిరాయ్ వస్తుంది. తేజ సజ్జా లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో మంచు మనోజ్ కూడా నటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న ఘాటి వర్సెస్ మిరాయ్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది.