ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Aamir Khan: 60 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డ ఆమిర్ ఖాన్!

Aamir Khan: 60 ఏళ్ల వయసులో  ప్రేమలో పడ్డ ఆమిర్ ఖాన్!
ADVERTISEMENT

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి ప్రేమలో పడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన 60వ పుట్టినరోజున ప్రైవేట్ సమావేశంలో ఆయన గౌరీ స్ప్రాట్ అనే మహిళను తన గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత కొంతకాలంగా ఈ వార్తలు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నా, ఇప్పుడు ఆమిర్ స్వయంగా ధృవీకరించడం హాట్ టాపిక్‌గా మారింది.

గత 18 నెలలుగా గౌరీతో రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పిన ఆమిర్, ఆమెకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడని వెల్లడించారు. తన పిల్లలు జునైద్, ఇరా ఖాన్ కూడా గౌరీను కలిసారని, వాళ్లకు ఆమెతో మంచి అనుభూతి కలిగిందని తెలిపారు. అయితే పెళ్లి గురించి ప్రత్యేకంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఈ రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా కొనసాగుతోందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఆమిర్ తన గర్ల్‌ఫ్రెండ్ కత్రినా కైఫ్ కంటే అందంగా ఉంటుందని చెప్పిన మాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాను గౌరీతో ఉన్నప్పుడల్లా ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుందని చెప్పిన ఆమిర్, ఇది తన జీవితంలో ప్రత్యేకమైన ఫేజ్ అని తెలిపారు. ఈ విషయమై బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ వార్తలతో బాలీవుడ్‌లో మళ్లీ ఆమిర్ ఖాన్ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. తన లగాన్ సినిమా డైలాగ్‌ను ప్రస్తావిస్తూ, ‘‘భువన్‌కు అతని గౌరీ లభించింది’’ అని సరదాగా వ్యాఖ్యానించడంతో ఈ వార్త మరింత వైరల్ అయింది. గౌరీ ఇప్పటికే బెంగళూరు నుంచి ముంబైకి మకాం మార్చిందని సమాచారం. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకుంటుందా లేదా ఇలా రిలేషన్‌షిప్‌గా కొనసాగుతుందా? అనేది ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం ఒక మహిళతో డేటింగ్‌ చేస్తున్నా…’’ అంటూ బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ ముంబయిలో గురువారం తన ప్రీ బర్త్‌డే మీడియా సమావేశంలో ప్రకటించి, ఆమె పేరు చెప్పగానే… సెర్చ్‌ ఇంజన్లన్నీ బిజీ అయిపోయాయి. ఆమె గురించి వివరాలు తెలుసుకోవాలని సినీ అభిమానులు తహతహలాడారు. ఆమెతో తన అనుబంధం గురించి చెబుతూ ‘కభీ కభీ మేరే దిల్‌ మే…’ అంటూ పాట కూడా పాడారు ఆమిర్‌. ఇంతకీ ఎవరామె?

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ఖాన్‌ చేసిన చిన్న ప్రకటనతో.. ఒక్క పూటలోనే సెలబ్రెటీగా మారిపోయారు గౌరీ స్ర్పాట్‌. నిజానికి గురువారం సమావేశానికి ఒక రోజు ముందు తన ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రీ బర్త్‌డే డిన్నర్‌ పార్టీలో గౌరీని తోటి సూపర్‌స్టార్స్‌ షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌లకు అమీర్‌ పరిచయం చేశారు. ప్రస్తుతం అమీర్‌తో సహజీవన బంధంలో ఉన్న గౌరి అతనికి చిరకాల మిత్రురాలే. ఆమె స్వస్థలం బెంగళూరు. తల్లి రీటా స్ర్పాట్‌ ఆ నగరంలో ప్రసిద్ధి చెందిన ‘స్ర్పాట్‌ సెలూన్‌’ నిర్వాహకురాలు. ఆమె తాత స్వాతంత్య్ర సమరయోఽధుడు. గౌరీ ‘బ్లూ మౌంటెన్‌’ స్కూల్లో చదువుకున్నారు. ఫ్యాషన్‌ విభాగంలో ఉన్నత విద్య అభ్యసించారు. 2004లో లండన్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ ది ఆర్ట్స్‌’లో స్టయిలింగ్‌ ్క్ష ఫొటోగ్రఫీ కోర్సు పూర్తిచేశారు. ప్రస్తుతం తల్లి బాటలోనే ముంబయిలో ‘బి బ్లంట్‌’ సెలూన్‌ను నిర్వహిస్తున్నారు. ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లో కూడా పనిచేస్తున్నారు. గౌరీకి ఇప్పటికే ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అమిర్‌తో ఆమె స్నేహం 25 ఏళ్ల నాటిది. ఏడాదిన్నర నుంచి వీరి స్నేహం మరింత బలపడి అందమైన అనుబంధంగా మారింది.

సామాజిక సమస్యలు ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన పలు సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఆమిర్‌ ఖాన్‌… తొమ్మిది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులతోపాటు 2003లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్‌ పురస్కారాలు, చైనా ప్రభుత్వం నుంచి గౌరవ పురస్కారం అందుకున్నారు. అతనికి గతంలో రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటి భార్య రీనా దత్తా. వీరు 1986లో వివాహం చేసుకున్నారు. 2002లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. పెళ్లి నాటికి రీనా వయసు 19 ఏళ్లు కాగా ఆమిర్‌ వయసు 21 ఏళ్లు. వీరికి కొడుకు జునైద్‌ ఖాన్‌, కూతురు ఐరా ఖాన్‌ ఉన్నారు. జునైద్‌ ఇటీవలే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో సహాయ దర్శకుడిగా పనిచేసి పేరు తెచ్చుకున్నాడు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. ఐరా ఖాన్‌ ఈ మధ్యే ఫిట్‌నెస్‌ కోచ్‌ నుపుర్‌ శిఖారేను పెళ్ళి చేసుకుంది. మానసిక ఆరోగ్య సమస్యలపై రూపొందించిన ఒక నాటకం ఆమెకు ప్రశంసలను తెచ్చిపెట్టింది.

ఆమిర్‌ రెండో భార్య కిరణ్‌ రావు. ‘లగాన్‌’ సెట్స్‌ మీద మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి, 2005లో వివాహం చేసుకున్నారు. అభిప్రాయ భేధాలతో 2021లో విడాకులు తీసుకున్నారు. పెళ్లి నాటికి కిరణ్‌ వయసు 32 ఏళ్లు. ఆమె ప్రముఖ దర్శకురాలు, నిర్మాత, స్ర్కీన్‌ప్లే రచయిత. వీరి కొడుకు ఆజాద్‌ రావు ఖాన్‌ 2011లో సరోగసీ ద్వారా జన్మించాడు. అతను ఎక్కువగా కుటుంబ వేడుకల్లో కనిపిస్తాడు. మీడియాకు దూరంగా ఉంటాడు. రీనా, కిరణ్‌ ఇద్దరితోనూ స్నేహాన్ని ఆమిర్‌ కొనసాగిస్తున్నారనీ, పిల్లలందరినీ ప్రేమగా చూసుకుంటాడనీ చెబుతారు. పిల్లలకు వ్యక్తిగతంగా సలహాలు, వృత్తిపరంగా సూచనలు ఇస్తూ తండ్రిగా మార్గనిర్దేశనం చేస్తూ ఉంటారు. గౌరీతో బంధాన్ని ఆమిర్‌ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా అంగీకరించడం విశేషం.

Tags: #AmirKhan#Gowrispratt#longtimefriend
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pawan Kalyan : నిలబడ్డాం..గెలిచాం..!

Next Post

Sunita Williams: హమ్మయ్యా.. భూమి మీదకు వచ్చేస్తున్నారు..!

Related Posts

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram
Entertainment

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

#AI, #ArtificialIntelligence, #AIJobs, #FutureOfJobs, #Automation, #RobotProtest, #AIRegulation, #Technology, #FutureOfWork, #Employment, #DigitalWorld, #AIImpact, #Robots, #Jobs, #HumanFuture, #TechnologyNews
Big Story

AIRobots:ఏఐ వల్ల మనిషి భవిష్యత్తు ఎటు? ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం ఇదే

#ChandrababuNaidu, #NarendraModi, #ChandrababuModi, #PoliticalEquations, #AndhraPradeshPolitics, #APPolitics, #TDP, #BJP, #NDA, #IndianPolitics, #PoliticalAnalysis, #Chandrababu, #Modi, #AndhraPradesh
Big Story

IndianPolitics:చంద్రబాబు-మోదీ రాజకీయ సమీకరణాలు: గత వైఖరి నుంచి నేటి ప్రశంసల వరకు అసలు కథ ఇదే

AP Contract Staff Nurses Strike
Andhra Pradesh

AP Contract Staff Nurses Strike: అనంతపురం జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల మహాధర్నా

#Fortune99Homes, #MadiralaRosireddy, #Fortune99HomesMDMadiralaRosireddyArrest, #RealEstateFraud, #RealEstateScam, #HyderabadCrime, #BanjaraHillsPolice, #JadcherlaLandScam, #PlotFraud, #LandScam, #CheatingCase, #FakeDocuments, #HyderabadNews, #TelanganaNews, #RealEstateNews, #CrimeNews, #BanjaraHills, #Gachibowli, #MadiralaRosireddyArrest ,CRIMENEWS ,Telangana
Big Story

Telangana:రియల్ ఎస్టేట్ మోసం ఆరోపణలు.. ఫార్చ్యూన్ 99 హోమ్స్ ఎండీ రోసిరెడ్డి అరెస్ట్ అసలేం జరిగింది?

BJP Rajya Sabha Nominations 2026
Big Story

BJP Rajya Sabha Nominations 2026: హర్దీప్ పూరి, బీఎల్ వర్మకు నో.. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు

Next Post
Sunita Williams: హమ్మయ్యా.. భూమి మీదకు వచ్చేస్తున్నారు..!

Sunita Williams: హమ్మయ్యా.. భూమి మీదకు వచ్చేస్తున్నారు..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

#AI, #ArtificialIntelligence, #AIJobs, #FutureOfJobs, #Automation, #RobotProtest, #AIRegulation, #Technology, #FutureOfWork, #Employment, #DigitalWorld, #AIImpact, #Robots, #Jobs, #HumanFuture, #TechnologyNews

AIRobots:ఏఐ వల్ల మనిషి భవిష్యత్తు ఎటు? ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం ఇదే

#ChandrababuNaidu, #NarendraModi, #ChandrababuModi, #PoliticalEquations, #AndhraPradeshPolitics, #APPolitics, #TDP, #BJP, #NDA, #IndianPolitics, #PoliticalAnalysis, #Chandrababu, #Modi, #AndhraPradesh

IndianPolitics:చంద్రబాబు-మోదీ రాజకీయ సమీకరణాలు: గత వైఖరి నుంచి నేటి ప్రశంసల వరకు అసలు కథ ఇదే

AP Contract Staff Nurses Strike

AP Contract Staff Nurses Strike: అనంతపురం జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల మహాధర్నా

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info