ఖరీదైన చీరల్లో తళుకుబెళుకులు ప్రదర్శించడం బాలీవుడ్ సెలబ్రిటీలకు కొత్తేమీ కాదు కానీ, ఈసారి వినాయక చవితి ఉత్సవాల్లో కనిపించిన తారా సుతారియా ఈవెంట్లో షో స్టాపర్ గా నిలిచింది. దీనికి కారణాలు రెండు. ఒకటి ప్రియుడు వీర్ పహారియాతో కలిసి ఫోటోషూట్ లో పాల్గొనడం, రెండోది తాను ధరించిన తళుకుబెళుకుల కంజీవరం చీర.
తరుణ్ తహిలియాని రూపొందించిన షాంపైన్ బంగారు టిష్యూ కంజీవరం చీరలో తార పుత్తడి బొమ్మను తలపించింది. ఈ చీర ఖరీదు సుమారు 4.5లక్షలు.ఈవెంట్లో అందమైన డిజైనర్ శారీ గుబులు పుట్టించింది. అద్భుతమైన హస్తకళా నైపుణ్యంతో ఫ్లోరల్ మోటిఫ్ లతో రూపొందించిన డిజైనర్ చీరలో తార తళుకుబెళుకులు గుండెల్ని కొల్లగొట్టాయి. ట్రెడిషనల్ శారీకి మ్యాచింగ్ గా బ్యాక్‌లెస్ బ్లౌజ్ ని తారా ధరించి కనిపించింది.
ఇదే ఈవెంట్లో తారా ప్రియుడు వీర్ డిజైనర్ షేర్వాణీలో మెరుపులు మెరిపించారు. తారతో కలిసి సన్నిహితంగా ఫోటోషూట్లకు ఫోజులిచ్చాడు. వీటిలో జంట చూడముచ్చటగా ఉందంటూ కితాబు అందింది. తారా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. యష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న టాక్సిక్ లో కీలక పాత్రను పోషిస్తోంది. తదుపరి ప్రాజెక్టుల గురించి తారా వెల్లడిస్తుందేమో చూడాలి.
#TaraSutaria lights up our feed with her stunning look & heartfelt wishes for #GaneshChaturthi. ♥️ #Celebs pic.twitter.com/GZnz30SouR
— news7telugu (@news7telug2024) September 2, 2025