మస్క్ పితృత్వంపై వివాదాస్పద నివేదిక
జపాన్ ఉన్నత వర్గానికి చెందిన మహిళకు వీర్యదానం
‘పిల్లల సైన్యం’ కావాలని ప్రయత్నిస్తున్న ప్రపంచ కుబేరుడు
ఇప్పటికే నలుగురు మహిళలతో 14 మంది పిల్లలు
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ‘పిల్లల సైన్యం’ (లెజియన్) నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా తల్లులను వెతుకుతున్నారని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ (డబ్ల్యూఎస్‌జే) ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఇప్పటికే నలుగురు మహిళల ద్వారా మస్క్‌కు 14 మంది పిల్లలు ఉన్నారు. గాయని గ్రిమ్స్, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్, మాజీ భార్య జస్టిన్, కన్జర్వేటివ్ ఇన్‌ఫ్లుయెన్సర్ యాష్లే సెయింట్ క్లెయిర్ ల ద్వారా మస్క్ ఈ సంతానాన్ని పొందారు. తనకు పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారని మస్క్ ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని మస్క్ సన్నిహిత వర్గాలు భావిస్తున్నట్లు కథనం పేర్కొంది.
యుగాంతంలోపు ‘లెజియన్-స్థాయి’ పిల్లలు కావాలని మస్క్ తనతో చెప్పినట్లు క్లెయిర్ చెప్పారట. కాగా, జపాన్ కు చెందిన ఉన్నత వర్గానికి చెందిన ఓ మహిళ కోరడంతో మస్క్ వీర్యదానం చేసినట్లు ఈ కథనం వెల్లడించింది. పిల్లల తల్లులను ఆర్థిక ప్రయోజనాలు, కఠినమైన గోప్యతా ఒప్పందాల ద్వారా మస్క్ నియంత్రిస్తున్నారని కొందరు మహిళలు ఆరోపించినట్లు నివేదిక తెలిపింది. పిల్లాడి తండ్రి పేరును రహస్యంగా ఉంచితే తనకు 15 మిలియన్ డాలర్లతో పాటు నెలనెలా లక్ష డాలర్లు ఇస్తానని మస్క్ హామీ ఇచ్చారని క్లెయిర్ తెలిపారు.
మస్క్ పేరును బహిర్గతం చేశాక నెలకు 40 వేల డాలర్లకు తగ్గించారని, వాల్ స్ట్రీట్ జర్నల్ పరిశోధన మొదలుపెట్టడంతో 20 వేల డాలర్లకు తగ్గించారని వివరించారు. శివోన్ జిలిస్‌కు మాత్రం తల్లులందరిలో ‘ప్రత్యేక హోదా’ ఉన్నట్లు, ఆమె మస్క్‌తో పాటు పలు ఉన్నత స్థాయి సమావేశాలకు హాజరైనట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గడం మానవాళి మనుగడకు ప్రమాదకరమని మస్క్ బలంగా నమ్ముతారని, నాగరికతను కాపాడాలంటే తెలివైన వారు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆయన తరచూ చెబుతుంటారని, ఈ నమ్మకమే ఆయన అధిక సంతానం కోరుకోవడానికి కారణమని డబ్ల్యూఎస్‌జే కథనం వివరించింది.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరొందిన ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి అనేక సంస్థల అధినేతగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక వివాదాస్పద అంశంతో మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇటీవల వెలువడిన ఓ జర్నల్ నివేదిక ప్రకారం, మస్క్ పిల్లల కోసం సరోగసీ ద్వారా పుట్టించడానికి పలువురు మహిళలతో రహస్య ఒప్పాందాలకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మస్క్ ప్రస్తుతం దాదాపు 14 మంది పిల్లలకు తండ్రిగా ఉన్నారు. తాజాగా, అతని 13వ బిడ్డ రోములస్‌ను జన్మించిన ఆష్లే సెయింట్ క్లెయిర్ అనే మహిళతో అతని సంబంధం బయటపడింది.
మస్క్ ఆమెకు గర్భం దాల్చడానికి ఆఫర్ చేశాడు. ఈ ఒప్పందం ప్రకారం, ఆమెకు నెలకు $10 నుంచి $15 మిలియన్ల వరకు ఆర్థిక సహాయం అందించబడింది. అయితే, ఆమె ఈ విషయం పబ్లిక్‌గా వెల్లడించడంతో, మస్క్ ఆ సహాయాన్ని తగ్గించి $20,000కి పరిమితం చేశాడని తెలిపింది. ఆష్లే సెయింట్ క్లెయిర్, మస్క్‌పై పితృత్వ ధృవీకరణ పత్రం నుంచి ఆయన పేరు తొలగించడానికి ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. ఈ వివాదం చట్టపరమైన దశలోకి వెళ్లింది. కానీ మస్క్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించాడు.
మస్క్, క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ టిఫనీ ఫాంగ్ వంటి ఇతర మహిళలతో కూడా సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు కూడా గర్భం దాల్చడానికి ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ ఆఫర్‌ను ఆమె తిరస్కరించడంతో, మస్క్ ఆమెను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. దీంతో ఆమె ఆన్‌లైన్ ఆదాయం తగ్గిందని ఆమె ఆరోపించారు. ఆమె తనను తానే “ఇష్టపడని క్రిప్టో జర్నలిస్ట్”గా పేర్కొంటుంది. ఆమె నిర్భయంగా అడిగే ప్రశ్నలు, బోల్డ్ ఇంటర్వ్యూలు ఆమెను క్రిప్టో మీడియా రంగంలో ప్రత్యేకంగా నిలిపాయి.
మానవ నాగరికత క్రమంగా తగ్గిపోతుందని, అందుకే ఎక్కువ మంది పిల్లలను కనడం అవసరమని మస్క్ భావిస్తున్నారు. ఆయన మాటల్లో “మార్స్ కోసం ప్రజలు అవసరం” అని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే అతను మరో సైన్యాన్ని తయారు చేసేలా ఉన్నారని పలువురు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే మరో గ్రహం కోసం అనేక మందిని తయారు చేసేలా ఉన్నాడని ఇంకొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎంత మందిని సృష్టిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.