దుల్కర్ సల్మాన్ పరిచయం అవసరం లేదు. నేడు భారతదేశంలోని పాన్ ఇండియా హీరోల్లో అతడు ఒకడు. మమ్ముట్టి నటవారసుడిగా కెరీర్ ప్రారంభించిన దుల్కార్ అగ్ర హీరోలలో ఒకరిగా ఎదిగేందుకు చాలా శ్రమించాడు. మలయాళం, తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమల్లో గొప్ప పాపులారిటీ ఉన్న హీరోగా ఎదిగాడు. అయితే వ్యక్తిగతంగా అతడి లవ్ లైఫ్ గురించి అభిమానులకు తెలిసింది తక్కువే. అతడి ప్రేమ, పెళ్లిలో చాలా ట్విస్టులున్నాయి. అవన్నీ సినిమాటిక్….!
అమెరికాలో విద్యనభ్యసించిన తరవాత భారతదేశానికి వచ్చిన దుల్కర్ సల్మాన్ కి పెళ్లి విషయమై ఇంట్లో పోరు తీవ్రతరమైంది. చాలా సంబంధాలు వస్తున్నా అవేవీ తనకు నచ్చడం లేదు. దీనికి కారణం అతడు పెద్దలు ఆర్టిఫిషియల్ గా సెటప్ చేసిన పెళ్లి కాకుండా, తనకు తెలిసిన, తన మనసుకు దగ్గరగా ఉండే ఒక స్నేహితురాలిని పెళ్లాడాలని సంకల్పించడమే.
అలా అతడు తన మనసుకు నచ్చే అమ్మాయి కోసం సెర్చ్ ప్రారంభించాడు. ఆ సమయంలో చెన్నైలో తన స్కూల్ మేట్ అమల్ సూఫియాను ఫేస్ బుక్ ద్వారా తిరిగి కలిసాడు. ఆరంభం ఎఫ్. బి ద్వారా పరిచయం చేసుకోవాలనుకున్నా అది సులువుగా జరగలేదు. చివరికి తనను కాఫీకి పిలిచాడు. కాఫీకి వచ్చాక గంటల తరబడి అమల్ సూఫియాతో మాట్లాడాడు. ఆ సమయంలో ఇద్దరి మనసులు కలిసాయి. 2011లో ఈ జంట వివాహం అయింది. దీనికోసం ఇరువైపులా పెద్దల్ని ఈ ప్రేమ జంట ఒప్పించారు.
ఇది వినడానికి సింపుల్ గా ఉన్నా కానీ, తన పెళ్లికూతురు కోసం వెతికేందుకు దుల్కార్ చాలా ప్రయాస పడిన సంగతిని అర్థం చేసుకోవాలి. ఇదంతా సినిమాటిగ్గా జరిగిన కథ. అమల్ సూఫియా నిజానికి తన చిన్నప్పటి క్లాస్ మేట్. ఐదేళ్ల చిన్న వయసు నుంచి కలిసి చదువుకున్నారు. కానీ స్కూల్ డేస్ లో ఇద్దరి మధ్యా ఎలాంటి క్రష్ లేదు. తర్వాత పెద్ద చదువుల కోసం విడిపోయారు. దుల్కార్ అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ స్టడీస్ పూర్తి చేసి తిరిగి వచ్చాక ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి చేయగా, అతడు తనకు తెలిసిన యువతిని పెళ్లాడాలనుకున్నాడు. అలా తన ఫ్రెండ్ అమల్ ని మళ్లీ చెన్నైలో కలుసుకున్నాడు. అక్కడ వారి మధ్య పరిచయం ప్రేమగా మారి, చివరికి పెద్దల అంగీకారంతో పెళ్లయింది.
అమల్ తన జీవితంలోకి రావడంతోనే తన అదృష్టం మొదలైందని దుల్కార్ చాలా సందర్భాల్లో చెప్పాడు. సెకండ్ షో, ఉస్తాద్ హోటల్ చిత్రాలతో దుల్కార్ హీరోగా కెరీర్ ప్రారంభించాడు. 2017లో తమ కుమార్తె మరియం అమీరాను స్వాగతించారు. దుల్కార్ నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. నిర్మాతగా తన స్నేహితురాలు ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నిర్మించిన `లోకా` ఘనవిజయంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంగా ఉన్నాడు.