తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో ఒక కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ దివి. ఈమె బిగ్‌బాస్ లో 49 రోజులు మాత్రమే ఉంది. అయినా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. సాధారణంగా బిగ్‌బాస్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, ఆ షో లో పాల్గొన్న వారు షో పూర్తయిన తర్వాత కనీసం కనిపించడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ దివి విషయంలో మాత్రం అలా కాదు, ప్రస్తుతం దివి ఈ రేంజ్‌లో గుర్తింపు దక్కించుకుని, హీరోయిన్స్ రేంజ్ లో సోషల్ మీడియా ఫాలోయింగ్ దక్కించుకుంది అంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంందుకే ఇప్పటికీ దివిని బిగ్ బాస్ ఫేం దివిగానే అంతా పిలుస్తూ ఉంటారు. బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్ కారణంగా ఇండస్ట్రీలో నిలిచింది.
బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీతో సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా దివి గురించి మాట్లాడటంతో ఆమెకు మరింత రీచ్ దక్కింది. అంతే కాకుండా తన సినిమాలో ఒక పాత్రను దివి కోసం ఇప్పిస్తాను అని కూడా చెప్పుకొచ్చాడు. దాంతో బిగ్‌బాస్ సీజన్ 4 వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా దివి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. పలు సినిమాల్లో నటించడంతో పాటు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటించడం ద్వారా దివి నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. అందుకే ఈమెకు సోషల్ మీడియాలో హీరోయిన్స్ రేంజ్ ఫాలోయింగ్ దక్కింది, అంతే కాకుండా ఈమె ఏ ఫోటోలు షేర్ చేసినా గంటల్లో వేలల్లో లైక్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం.
13 లక్షలకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న దివి రెగ్యులర్‌గా స్కిన్ షో ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక పొడవాటి షర్ట్ ధరించి థైస్ అందాలను చూపిస్తూ దివి కవ్వింపులకు పాల్పడింది. ఈ స్థాయిలో అందాల ఆరబోత ఎంతో మంది హీరోయిన్స్ చేస్తూనే ఉంటారు. కానీ దివి షో చాలా స్పెషల్ అంటూ నెటిజన్స్ ముఖ్యంగా దివిని అభిమానించే వారు అంటున్నారు. ఇలాంటి అందమైన దివికి కాకుండా పిచ్చి పిచ్చిగా ఉండే వారికి ఎలా హీరోయిన్ ఆఫర్లు వస్తాయని అంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అమ్మాయి కావడం వల్లే పాపం దివికి ఇండస్ట్రీలో ఆఫర్లు రావడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దివి థైస్ షో కి గుండె జారి గల్లంతవుతోంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో జన్మించిన దివి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. 2017లో మోడలింగ్ మొదలు పెట్టింది. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు మోడలింగ్ ఒక మంచి అవకాశం అని ఆమె భావించింది. అందుకే ఆ దిశగా అడుగులు వేసిందని తెలుస్తోంది. మహేష్ బాబు మహర్షి సినిమాలో చిన్న పాత్రలో నటించింది. కానీ ఆ సమయంలో దివిని పెద్దగా ఎవరూ గుర్తించలేదు. కానీ బిగ్‌బాస్ లో ఎంట్రీ ఇచ్చి కొన్ని రోజుల తర్వాత దివి ఒక్కసారిగా బరస్ట్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. భలే ఉందే అని చాలా మంది దివిని హౌస్‌లో ఉన్న సమయంలోనే తెగ అభిమానించడం, ఆరాధించడం మొదలు పెట్టారు. తెలుగులో కాకుండా ఇతర భాషల్లో దివి హీరోయిన్‌గా ప్రయత్నిస్తే మంచి అవకాశాలు వస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Gorgeous !! #DiviVadthya pic.twitter.com/AVUGWQsPo5
— news7telugu (@news7telug2024) September 1, 2025