ప్రస్తుత కాలంలో అమ్మాయిలు ఎక్కువగా సోషల్ మీడియాలో సమయాన్ని గడిపేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సెలబ్రిటీల విషయానికొస్తే ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇదే సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకొని.. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా మారిన వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకొని అందాలు ఆరబోస్తూ దర్శకుల కంట్లో పడే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఎప్పటికప్పుడు తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ గ్లామర్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది దివివాద్య.
ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి చీరకట్టులో కనిపించి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా నెట్టెడ్ బ్లాక్ శా రీ ధరించిన ఈమె దానికి కాంబినేషన్లో మల్టీకలర్ థ్రెడ్ తో చాలా అందంగా డిజైన్ చేసిన బ్లాక్ కలర్ బ్లౌజ్ ధరించి.. తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. ముఖ్యంగా ఈ నెట్టెడ్ బ్లాక్ శారీలో తన అందాలను ప్రదర్శిస్తూ.. నడుము, నాభి అందాలు హైలైట్ అయ్యేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతే కాదండోయ్ స్టైలిష్ గా కూలింగ్ గ్లాస్ పెట్టి మరి నీలాంబరి 2 అనిపించింది ఈ ముద్దుగుమ్మ.పైగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ కింద క్యాప్షన్ లో.. “నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా.. శృంగార వీర” అంటూ నరసింహ సినిమాలో నీలాంబరి గెటప్ లో చేసిన రమ్యకృష్ణ పాడిన పాటను క్యాప్షన్ గా జోడించి తన అందాలను ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దివి వాద్య షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈమె కెరియర్ విషయానికి వస్తే.. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత సినీ నటిగా తనను తాను మార్చుకుంది. 2019లో వచ్చిన మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దివి.. బిగ్ బాస్ సీజన్ ఫోర్లో కంటెస్టెంట్ గా పాల్గొని అక్కడి నుంచి ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా హైదరాబాద్ టైమ్స్ ఈమెను ప్రకటించింది కూడా..
1996 మార్చి 15న తెలంగాణ హైదరాబాద్ లో జన్మించిన ఈమె ఎంబీఏ, ఎంటెక్ పూర్తి చేసింది. చివరిగా పుష్ప2 డాకు మహారాజ్ సినిమాలలో నటించిన ఈమె.. ఇప్పటికీ పలు చిత్రాలలో అవకాశాలు అందుకొని దూసుకుపోతోంది. ముఖ్యంగా గ్లామర్ వలకబోయడమే కాదు యాక్షన్ పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించగలను అని మరొకసారి నిరూపించింది. ఇకపోతే ప్రస్తుతం తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దివికి ఒక హీరోయిన్గా మంచి పాత్ర లభించాలి అని.. అందులో తన నట విశ్వరూపం చూపించి హీరోయిన్గా ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు . ఏది ఏమైనా టాలెంట్ ఉండాలి కానీ సరైన పాత్ర పడితే స్టార్ హీరోయిన్ హోదా ఈజీగా దొరుకుతుందని మరికొంతమంది తమ అభిప్రాయంగా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.




















