సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక క్రేజ్ ఉన్న బ్యూటీ. ఒకప్పుడు ఆమె యువకల కలల సుందరి. తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ, ఒడియా చిత్రాలలో ప్రత్యేక పాటలతో వెండితెరపై సందడి చేసింది. దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి ఇండస్ట్రీలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ తన జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలను ఎదుర్కోంది. ఆమె మరెవరో కాదు.. నటి డిస్కో శాంతి.. 1985లో విడుదలైన ‘ఉదయగీతం’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసిన ఆమె ‘ఊమై విళిగల్’, ‘రాజా సాధి’, ‘రసవ్ ఉన్నై నంబి’, ‘మనమగలే వా’, ‘ధర్మతిన్ తలైవన్’, ‘వెత్రివిజాత’ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. అప్పట్లో స్పెషల్ పాటలకు ఆమె కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం ఆమె వయసు 60 సంవత్సరాలు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తెలుగు నటుడు శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. స్పెషల్ సాంగ్స్ ద్వారా చాలా ఫేమస్ అయిన డిస్కో శాంతి టాలీవుడ్ యాక్టర్ శ్రీహరిని 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
శ్రీహరి, డిస్కో శాంతి దంపతులకు కూతురు పుట్టిన నాలుగు నెలలకే మరణించింది. ఈ ఘటన ఆమెపై తీవ్ర ప్రభావం చూపించింది. తన కూతురి జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పలు గ్రామాలకు పరిశుభ్రమైన నీరు, పాఠశాల సౌకర్యాలను అందించారు. జీవితం ప్రశాంతంగా సాగుతున్న సమయంలో నటుడు శ్రీహరి 2013లో గుండెపోటుతో కన్నుమూశారు. భర్త మరణంతో డిస్కో శాంతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. దీంతో తాను మద్యానికి బానిసైనట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు డిస్కో శాంతి. తన భర్త మరణం నుంచి తాను కోలుకోలేకపోయానని.. దాదాపు ఏడేళ్లు మద్యానికి బానిసైనట్ల చెప్పుకొచ్చింది.
మేల్కోని ఉన్నప్పుడు జీవితంలో జరిగిన విషాదం గుర్తుకు వచ్చేదని.. భోజనం చేయకుండా మద్యానికి బానిసైనట్లు తెలిపింది. ఆ సమయంలో తాను 45 కిలోలు తగ్గినట్లు చెప్పుకొచ్చింది. అలాగే మద్యం సేవిస్తూ ఉంటే తాను ఒక నెల కూడా ఉండనని డాక్టర్ హెచ్చరించడాని.. దీంతో తన పిల్లలు తనను వారించారని తెలిపింది. గత నాలుగేళ్లుగా తాను మద్యానికి దూరంగా ఉన్నట్లు తెలిపింది.