పాకిస్థాన్‌తో యుద్దం నేపథ్యంలో భారత సైన్యానికి సాయం అందించాలంటూ ప్రాదేశిక సైన్యానికి పిలుపు అందింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. ప్రాదేశిక సైన్యం సేవలను ఉపయోగించుకునేందుకు భారత సైనిక అధ్యక్షుడికి పూర్తి అధికారం ఉందని చెప్పింది. సైన్యానికి అనుబంధంగా ఉంటూ ప్రాదేశిక సైన్యం చేయూత అందించనుంది.
గతంలో కూడా సైన్యానికి ప్రాదేశిక సైనిక వర్గం సేవలు అందించింది. ఇప్పుడు కూడా సేవలు అందించబోతుంది. ఆపరేషన్ పరాక్రమ్, కార్గిల్ యుద్ద సమయంలోనూ ప్రాదేశిక సైన్యం.. భారత సైనిక దళానికి సేవలు అందించింది. ఈ ప్రాదేశిక సైన్యంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో టీమిండియా మాజీ కెప్టెన్‌లు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్ ఉండగా.. మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలెట్ కూడా ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదాలో కొనసాగుతున్నారు. ప్రాదేశిక సైన్యం అనేది స్వచ్ఛంద పౌరులతో కూడిన సైనిక సంస్థ, వీరు దేశానికి అవసరమైనప్పుడు సేవ చేయడానికి శిక్షణ పొందుతారు.
మహేంద్ర సింగ్ ధోనీకి 2011లో భారత ప్రాదేశిక సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రదానం చేసింది. ఇది క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా దక్కింది. ధోనీ పారాట్రూపర్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ ట్రైనింగ్‌లో అర్హత కూడా సాధించాడు. 2019 వన్డే ప్రపంచకప్ పరాజయం అనంతరం.. ధోనీ తన బెటాలియన్‌తో కలిసి కాశ్మీర్ లోయలో దాదాపు 15 రోజుల పాటు పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీ వంటి విధుల్లో పాల్గొన్నాడు. ఇది అతని అభ్యర్థన మేరకు ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ అనుమతి ఇచ్చింది.
ప్రాదేశిక సైన్యంలో ధోనీ గౌరవ హోదాలో ఉన్నందున, అవసరమైతే అతన్ని కూడా విధులకు పిలిచే అవకాశం ఉంది. కానీ ప్రత్యేకంగా ధోనీకి భారత సైన్యం నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. ధోనీ తరహాలోనే క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా కపిల్ దేవ్‌కు కూడా భారత ప్రాదేశిక సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కింది. మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలెట్.. ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదా కలిగి ఉన్నారు. ఆయన గౌరవ హోదాలో కాకుండా.. సాధారణ అధికారిగా ఇందులో చేరారు. ఇందుకు కావాల్సిన శిక్షణను ఆయన పూర్తి చేశారు. ఈ కఠిన సమయంలో భారత్ ఆర్మీకి ఈ ముగ్గురు ప్రముఖులు అండగా నిలవవచ్చు.
భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో నేరుగా పాకిస్తాన్ జట్టును ఇండియా ఎదుర్కొంటే… ప్రత్యర్థి పాకిస్తాన్ మాత్రం దొంగ దెబ్బతీస్తోంది. సీస్ ఫైర్ బ్రేక్ చేసి మరి ఇండియా పై దాడులు చేసే కుట్రలు చేస్తోంది. అయితే వాటన్నిటినీ ఇండియన్ ఆర్మీ… చాలా చక్కగా ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… యుద్ధరంగంలోకి మహేంద్రసింగ్ ధోని దిగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో… మహేంద్ర సింగ్ ధోని సహాయం కోరినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యానికి సహాయం కావాలంటూ టెరిటోరియల్ ఆర్మీకి రక్షణ శాఖ పిలుపునిచ్చింది. దీనితో సైన్యానికి అనుబంధంగా ఉంటూ టెరిటోరియల్ ఆర్మీకి చేయూత అందించబోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఆ ఆర్మీలో మహేంద్రసింగ్ ధోని అలాగే కపిల్ దేవ్ కూడా ఉన్నారు. దీంతో మహేంద్రసింగ్ ధోని కూడా పాక్తో యుద్ధం చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని… ఐపీఎల్ 2025 టోర్నమెంట్ రద్దు కావడంతో… జార్ఖండ్ వెళ్ళిపోయాడు. తన కుటుంబంతోనే మహేంద్ర సింగ్ ధోని ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఒకవేళ భారత ఆర్మీకి సహాయం చేయాలనుకుంటే…. మహేంద్ర సింగ్ ధోని బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఆయన నేరుగా యుద్ధం చేయకపోవచ్చు. ఆర్మీకి సలహాలు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. దీంతో… మహేంద్ర సింగ్ ధోని యుద్ధ రంగంలోకి దిగాలని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.