కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం తెలుగులో కూడా వరుస సినిమాలలో చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన పూర్తి స్థాయి తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. సార్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ధనుష్ ఇటీవల కుబేర సినిమా ద్వారా ప్రేక్షకులకు ముందుకు వచ్చి మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు.
ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను ఒక అమ్మాయిని చూసి చాలా ఇష్టపడ్డాను ఆ అమ్మాయి కోసమే ట్యూషన్ కి వెళ్లే వాడినని తెలిపారు. ఇలా అమ్మాయిని చూస్తూ ట్యూషన్ లో టైం స్పెండ్ చేసే వాడిని కానీ టీచర్ అడిగితే ఏమి చెప్పలేకపోయేవాడిని అందుకే నాకే సిగ్గుగా అనిపించి ట్యూషన్ మానేశాను. ట్యూషన్ మానేసిన కూడా అమ్మాయి కోసం బయట ఎదురు చూసేవాన్ని అప్పుడు టీచర్ అనేది మీరంతా చదువుకొని మంచి పొజిషన్లో ఉంటారు బయట ఉన్న వ్యక్తి మాత్రం రోడ్ల పైన డ్యాన్సులు వేసుకోవాల్సిందే అంటూ నన్ను ఉద్దేశించి మాట్లాడరు.
ఇక కెరియర్ మొదట్లో తాను ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాను ముఖ్యంగా నా లుక్స్ గురించి చాలామంది హేళన చేశారు కానీ దర్శకుడు బాలు మహేంద్ర.. ‘నువ్వు ఇటాలియన్ మోడల్‌లా కనిపిస్తావు. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు’ అని చెప్పారు. ఆ మాటలు నన్ను ప్రేరేపించాయని తెలిపారు. ఇకపోతే చాలా మనసులో ఉన్న ఒక కోరికను కూడా ఈ సందర్భంగా ధనుష్ బయటపెట్టారు బయోపిక్ సినిమాలు కనుక చేస్తే కచ్చితంగా రజనీకాంత్ అలాగే ఇళయరాజా గారి బయోపిక్ సినిమాలు చేయాలనేది నా చిరకాల కోరిక అని వారిద్దరూ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు అంటూ ఈ సందర్భంగా ధనుష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.