కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలో ఇడ్లీ కొడై సినిమాతో రాబోతున్నాడు. ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. రాయన్ తో తన డైరెక్టోరియల్ సినిమాతో కూడా హిట్ అందుకున్న ధనుష్ మరోసారి ఇడ్లీ కొడైతో అలరించాలని చూస్తున్నాడు. ధనుష్ ఇడ్లీ కొడై సినిమా అక్టోబర్ 1న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే ఈ సినిమా రెండు భారీ అండ్ క్రేజీ సినిమాలకు పోటీగా వస్తుంది. ఒక సినిమా సక్సెస్ ఈమధ్య సినిమాలో కంటెంట్ కన్నా రిలీజ్ టైం ను బట్టి డిసైడ్ అవుతుంది.
మంచి కథతో వచ్చినా రిలీజ్ ప్లేస్ మెంట్ సరిగా లేకపోవడం వల్ల ఫ్లాపైన సినిమాలు చాలా ఉన్నాయి. ఐతే వేరే సినిమాలతో పోటీకి వచ్చి ఆ ఫైట్ ని తట్టుకోలేక చేతులెత్తేసిన సినిమాలు ఉన్నాయి. ఐతే దసరాకి సినీ ప్రియులకు సూపర్ ట్రీట్ ఇవ్వాలని సినిమాలు వస్తున్నాయి. దసరాకే తన సినిమా రిలీజ్ చేస్తున్నాడు రిషబ్ శెట్టి. కాంతారా 2 తో రిషబ్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. కాంతార సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా 2 సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఐతే అక్టోబర్ 2న కాంతార 2 వస్తుంది. దానికి ఒకరోజు ముందు ధనుష్ ఇడ్లీ కొడై వస్తుంది. ఈ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జోనర్లే అయినా రెండు సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతుంది.
మరోపక్క సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా వస్తుంది. ఇక ఆ సినిమాపై ఉన్న అంచనాలు ఏంటన్నది తెలిసిందే. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఓజీతో నెవర్ బిఫోర్ రికార్డులు సెట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సెప్టెంబర్ 25న ఓజీ వస్తుంది.. ఆ నెక్స్ట్ అక్టోబర్ 1న ఇడ్లీ కొడై.. 2న కాంతార 2 వస్తున్నాయి. ఓజీకి ఎలా లేదన్నా వారం వరకు టైం ఉంది. కానీ ఓజీ కూడా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే మాత్రం ధనుష్, రిషబ్ శెట్టి సినిమాలకు షాక్ తగిలే ఛాన్స్ ఉంది. మరోపక్క కాంతార 2 పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి వాటిని అందుకోవాలి. ధనుష్ ఇడ్లీ కొడై మాత్రం అతని నుంచి వస్తున్న మరో సింపుల్ అండ్ ఎమోషనల్ సినిమా అని తెలుస్తుంది. ఓజీ, ఇండ్లీ కొడై, కాంతార 3 సినిమాలు 3 డిఫరెంట్ జోనర్స్ తో వస్తున్నాయి. అందుకే 3 సినిమాలకు కూడా ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి వీటిలో ఏ సినిమా విజయ దుందుంభి మోగిస్తుందో చూడాలి.