లేటెస్ట్ గా సోషల్ మీడియాలో యంగ్ యాక్ట్రెస్ దేవియాని శర్మ పోస్ట్ చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బాత్‌టబ్‌లో హై లెవెల్ లో గ్లామర్ ను హైలెట్ చేస్తూ ఇచ్చిన ఫోజులు అభిమానుల మతి పోగొడుతున్నాయి. సిల్వర్ శైనీ డ్రెస్‌లో మెరిసిపోతూ కెమెరా ముందు ఇచ్చిన లుక్స్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ‘సాఫ్ట్ కర్వ్స్, షార్ప్ మైండ్.. బుల్‌షిట్‌కి టాలరెన్స్ లేదు’ అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్‌కి యువత రిప్లైలు మీద రిప్లైలు ఇస్తున్నారు.
ఈ ఫోటోషూట్‌లో దేవియాని శర్మ ధరించిన మినీ డ్రెస్సు, ఆమె మేకప్, హెయిర్ స్టైల్ అన్నీ కలిపి లుక్‌ను అసాధారణంగా మార్చేశాయి. టబ్‌లో కూర్చొని ఇచ్చిన ప్రొఫైల్ షాట్లు, క్లోజప్ పిక్స్ లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఆమె స్టైల్ అనుభవాన్ని ఫీలవుతుంది. సింపుల్ డ్రెస్‌లోనే గ్లామర్ ను హై లైట్ చేసి ట్రెండింగ్ అవ్వడం ద్వారా దేవియాని తన ఫ్యాషన్ సెన్స్‌ను మరోసారి ప్రూవ్ చేసింది.
బ్యాక్‌టుబ్యాక్ ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దివ్యాని, ఇటీవలి కాలంలో సౌత్ ఇండియన్ వెబ్ సిరీస్‌లలో, తక్కువ బడ్జెట్ సినిమాల్లో కనిపించింది. రొమాంటిక్ అనే సినిమాతో పాటు షైతాన్, సేవ్ ది టైగర్స్ వంటి వెబ్ సీరీస్ లు చేసింది. అయితే ఇప్పటి వరకు ఆమెకు మంచి కమర్షియల్ బ్రేక్ రావడం లేదు. కానీ తన గ్లామర్ ప్రెజెన్స్, సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే.. త్వరలో టాలీవుడ్‌లో ఒక బిగ్ ఛాన్స్ రావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దేవియాని కెరీర్‌ను చూస్తే, మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ భామకు ఫిట్‌నెస్, స్టైలింగ్, ఫోటో ఏంగిల్స్‌లో మంచి అవగాహన ఉంది. అలానే ఆమె గ్లామర్‌కు తగ్గట్టే బోల్డ్ క్యాప్షన్లు పెట్టడం ద్వారా సోషల్ మీడియాలో తానేంటో చూపిస్తోంది. దీంతో నెట్టింట యువత మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్లు, డిజైనర్లు కూడా ఆమె ఫోటోషూట్స్ పై ఆసక్తిగా స్పందిస్తున్నారు.