ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు సినిమాల్లోకి రావడానికి బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదు. సోషల్ మీడియాలో పాపులర్ అయితే చాలు.. అవకాశాలు చాలా ఈజీగా వస్తున్నాయి. ఎవరైనా సరే సోషల్ మీడియా ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఇప్పటికే ఇలా సోషల్ మీడియాలో పాపులర్ అయి సినిమాల్లో ఆఫర్స్ అందుకున్న వారిని ఎంతో మందిని చూశాం. ఇలాంటివారిలో దీప్తి సునయన కూడా ఒకరు.. యూట్యూబర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన దీప్తి సునయన ప్రైవేట్ సాంగ్స్,లవ్ సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకుంది.
ముఖ్యంగా ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటి ద్వారా షాట్స్, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది. అలా పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో కూడా ఈ ముద్దుగుమ్మ రాణించింది. అలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటూ పొట్టి బట్టలు వేస్తూ ట్రెండ్ ని ఫాలో అవుతూ తన అభిమానులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా బ్లాక్ శారీలో ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. బ్లాక్ శారీలో దీప్తి సునయన అందాలు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.. సముద్ర తీరాన దీప్తి సునయన చీరలో తన అందాలను ఆరబోస్తున్న ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి..
అయితే దీప్తి సునయన ఇలాంటి ఫోటోలు తరచుగా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా షేర్ చేసిన ఈ శారీ ఫొటోస్ మాత్రం అభిమానులను మరింత ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా బ్లాక్ శారీలో నడుము అందాలను హైలెట్ చేస్తూ దీప్తి సునయన ఇచ్చిన ఫోజులకి కుర్రకారు మతిపోతుంది. ఈ బ్లాక్ శారీ ఫోటోలకు బ్లాక్ కలర్ హాట్ సింబల్ ని క్యాప్షన్ గా పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి.
దీప్తి సునయన కెరియర్ చూసుకుంటే.. యూట్యూబర్ గా సక్సెస్ అయిన దీప్తి సునయనకి బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్లే అవకాశం వచ్చింది. అలా బిగ్ బాస్ 5 ద్వారా దీప్తి సునయన మరింత ఫేమస్ అయ్యింది. అలా హౌస్ లో హీరో తనిష్ తో క్లోజ్ గా ఉండి లవ్ ట్రాక్ నడిపించడమే కాకుండా తన హాట్ అందాలతో, ఆట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకొని చాలా రోజులు హౌస్ లో కొనసాగింది.
బిగ్ బాస్ సీజన్ కి వెళ్లి వచ్చాక దీప్తి సునయన రేంజ్ కూడా మారిపోయింది. దీప్తి సునయన షణ్ముఖ్ జస్వంత్ అనే యూట్యూబర్ తో కారణంగా కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. వీరిద్దరూ కలిసి పలు ప్రైవేట్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు కూడా చేశారు. అయితే దీప్తి ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్,వెబ్ సిరీస్ లు భాగానే చేస్తున్నప్పటికీ సినిమాల్లో మాత్రం ఎక్కువగా ఆఫర్స్ రావడం లేదు.. దీప్తి సునయన నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ అనే సినిమాలో చేసింది. ఆ తర్వాత మళ్లీ ఆఫర్స్ రాలేదు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన సెలబ్రిటీ జంటల్లో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనల పేరు ఉంటుంది. కానీ ఈ జంట బ్రేకప్ కారణంగా వార్తల్లో నిలిచారు.