నాకు, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తే సహించను
—అలాంటి వారి భరతం పడతా
— ఫేక్ ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి
—-పోలీస్ అధికారులను కోరిన ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం
తెలుగుదేశం పార్టీకి, నాకు చెడ్డ పేరు రావడానికి ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఒక నాయకుడు ఇప్పటికీ కుట్రలు పన్నుతున్నారని, అలాంటి వారి భరతం పడతానని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి హెచ్చరించారు… నగర అభివృద్ధి కోసం ఓర్పుతో ఉన్నానని… ఓర్పును చేతగానితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు… సాయి నగర్ లో ఎమ్మెల్యే అనుచరులు కబ్జాకు ప్రయత్నించారని మహిళను కారులో ఎక్కించుకొని వచ్చి ఒక నాయకుని చెంచా ప్రెస్ మీట్ లో చెప్పించాడని ఆయన ఆరోపించారు… టిడిపి కార్యాలయాలపై దాడులు చేసే నీచ సంస్కృతి కలిగిన ఆ నాయకుడు చెప్పిన మాటలు విని, తాము చెప్పామని… స్టేషన్ కు స్వయంగా బాధితులే వెళ్లి చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు… నగరంలో తనకు చెడ్డ పేరు రావడానికి నా పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే స్వయంగా కార్యాలయానికి నా వచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు… తన పేరు ఎవరు ఉపయోగించుకొని కబ్జాలకు పాల్పడాలని ప్రయత్నించిన కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు… ఎమ్మెల్యే నైనా తనకు, టిడిపి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించే వారిని గుర్తించి, ప్రజలను జాగృతం చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే దగ్గుపాటి పిలుపునిచ్చారు..