ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు అనుమానాస్పందంగా మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఎర్రగుంట్లపాలెం మండలం బోయలపల్లికి చెందిన గుప్తా వెంకటేశ్వర్లు (35)కు భార్య దీపిక, కూతుళ్లు మోక్షిత(8), వర్షిణి(6), కుమారుడు శివధర్మ (4) ఉన్నారు. ఆగస్టు 30న భార్యతో జరిగిన గొడవ కారణంగా ఇంటి నుంచి ముగ్గురు పిల్లలను తీసుకొని వెంకటేశ్వర్లు బైక్‌పై వెళ్లిపోయాడు.
కాపాడాల్సిన కనురెప్పే కాటేసిన దుర్మార్గం ఇది. కన్నబంధం మాటున క్రూరత్వం దాగి ఉంటుందని తెలియని ముక్కుపచ్చలారని ముగ్గురు పిల్లల్ని.. వేలు పట్టి నడిపించే నాన్న కాలయముడు అవుతాడని అస్సలు ఊహించి ఉండరు ఆ చిన్నారులు. పేగుబంధాన్ని మరిచి ముగ్గురు కన్నబిడ్డల్ని దారుణంగా చంపేసిన దారుణం నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లల్ని తనతో బైకు మీద తీసుకెళ్లిన తండ్రి పాశవికంగా చంపేశాడు.
ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం మండలం పెద్దబోయపల్లికి చెందిన 38 ఏళ్ల వెంకటేశ్వర్లు మేనమరదలైన దీపికను పన్నెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు (8,6 సంవత్సరాలు) కొడుక్కి నాలుగేళ్లు. భార్యతో గొడవ పడిన వెంకటేశ్వర్లు గత నెల 30న ముగ్గురు పిల్లల్ని బైకు మీద ఎక్కించుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో.. భర్త.. ముగ్గురు పిల్లలు కనిపించటం లేదని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా రంగంలోకి దిగిన పోలీసులు ఆగస్టు 31న శ్రీశైలం మీదుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట దగ్గర్లోని హజీపూర్ చౌరస్తా వరకు వచ్చినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్ లో గుర్తించారు. ఒక్కొక్కరుగా పిల్లలు కనిపించకపోవటం.. బైకుతో సహా తండ్రి మిస్ కావటంతో ఆందోళన వ్యక్తమైంది. ఇదిలా ఉండగా తాజాగా పెద్దాపూర్ వద్ద వెంకటేశ్వర్ల డెడ్ బాడీని గుర్తించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. అతని బైక్ ఆధారంగా గుర్తించారు. దీంతో పిల్లలు ఎక్కడన్న ఆరా మొదలైంది. మళ్లీ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా జూపల్లి వద్దకు బైక్ మీద వచ్చేసరికి పెద్ద కూతురు మోక్షిత ఒక్కతే తండ్రి వద్ద ఉంది. ఈ స్థితిలో చిన్న కూతురు.. కొడుకు డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించాయి. అనంతరం తాండ్ర సమీపంలో పెద్ద కుమార్తె డెడ్ బాడీ దొరికింది. ఆమె మృతదేహం కూడా కాలిపోయి ఉంది. దీంతో.. పిల్లలకు పురుగులు మందు తాగించి చంపి.. పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఉదంతం తీవ్ర విషాదానికి గురి చేసింది.