సౌత్ లో సినిమాలకు మంచి సీజన్ అంటే సంక్రాంతే. ఆ సీజన్ లో సినిమాలను రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్లు వస్తాయి. సంక్రాంతికి సెలవులుండటంతో పాటూ ఆడియన్స్ ప్రేక్షకులతో థియేటర్లకు వెళ్లాలనుకుంటారు కాబట్టి అందరి చూపూ సంక్రాంతిపైనే ఉంటుంది. అందుకే సంక్రాంతి కోసం అందరూ ఎంతో ముందుగానే కర్ఛీఫ్ వేసుకుంటారు.
ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వెంకటేష్ ఆ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ను అందుకున్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం కలెక్షన్లను దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు తమ సినిమాలను పండక్కి తీసుకురావాలనుకుంటారు. అయితే ఈసారి 2026 సంక్రాంతికి ఎప్పటికంటే కాస్త ముందుగానే బెర్తులు కన్ఫర్మ్ అయిపోయాయి.
వాటిలో అన్నింటికంటే ముందు రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్న సినిమా ఎన్టీఆర్ నీల్ మూవీ. 2026, జనవరిలో తమ సినిమా వస్తుందని ఆ చిత్ర నిర్మాతలు సినిమాను అనౌన్స్ చేస్తూనే చెప్పారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మెగా157 కూడా సంక్రాంతికే వస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. దీంతో పండక్కి ఎన్టీఆర్, చిరూ మధ్య పోటీ తప్పదనకున్నారంతా. కానీ ఇప్పుడు సడెన్ గా ఎన్టీఆర్ నీల్ సినిమా పండగ రేసు నుంచి తప్పుకుంది. తమ సినిమా జూన్25, 2026న రిలీజ్ కానుందని ఎన్టీఆర్‌నీల్ చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేయడంతో ఆ సినిమా పండగ సీజన్ నుంచి తప్పుకున్నట్టైంది. సో ఇప్పుడు సంక్రాంతికి ఫిక్స్ అయిన సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరూ చేస్తున్న సినిమా ఒక్కటే.
మెగా157 కాకుండా నెక్ట్స్ పొంగల్ కు మరే పెద్ద హీరో నుంచి సినిమా వచ్చేట్టు కనిపించడం లేదు. వెంకటేష్, రవితేజ సినిమాలు సంక్రాంతికి టార్గెట్ చేస్తున్నాయంటున్నారు కానీ ఇంకా వారి సినిమాలు మొదలుకూడా కాని నేపథ్యంలో అవి ఎంతవరకు రిలీజవుతాయనేది చెప్పలేం. దిల్ రాజు బ్యానర్ నుంచి నితిన్ ఎల్లమ్మ, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు లాంటి సినిమాలు రేసులోకి వస్తాయంటున్నారు కానీ మెగా157 హైప్ ముందు ఆ సినిమాలు చాలా చిన్నవి. ఎన్టీఆర్ పోటీ నుంచి తప్పుకోవడంతో తమ హీరో సినిమాకు పోటీనే లేదని మెగా ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.