చుక్కపల్లి శంకర్ రావు జ్ఞాపకాలతో ఆయన కుమారుడు చుక్కపల్లి సురేష్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహకారంతో చుక్కపల్లి సురేష్ చేస్తున్న ఈ బ్లడ్ బ్యాంక్ క్యాంప్ ఎంతో గొప్ప పని అని అన్నారు చిరంజీవి. ఫ్యాన్స్ ని ఏదో ఒక విధంగా వాడుకోవడం కన్నా ఇలా రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడి ఆ అనుభూతిని పొందాలని అనుకున్నా. తన ఫ్యాన్స్ కూడా దాదాపు 27 ఏళ్లుగా బ్లడ్ డొనేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నారని అన్నారు చిరంజీవి.
ఇక తాను రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరికీ ఈజీ టార్గెట్ అని.. అలా ఒక పొలిటీషియన్ తనని దూషిస్తూ మాట్లాడితే అక్కడ ఒక మహిళ అతని మీద ఫైర్ అయ్యింది. చిరంజీవి సినిమాలకు కాదు ఆయన వ్యక్తిత్వానికి నేను అభిమానినని ఆమె చెప్పింది. ఆమె అలా ఎందుకన్నది అంటే.. తన బిడ్డకు ప్లేట్ లెట్స్ కౌంట్ పడిపోతే ఎవరో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి కాల్ చేయమన్నారట. అలా రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆమెకు ఫ్యాన్స్ హెల్ప్ చేశారు.
ఆ బ్లడ్ అందడం వల్ల ఆమె బిడ్డ కోలుకున్నాడు. ఇలా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వాళ్లుగా తన ఫ్యాన్స్ మంచి అనుభూతి పొందుతున్నారని అన్నాను. బ్లడ్ అందక చనిపోయారన్న వార్త తనలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టేలా చేసింద. ఫ్యాన్స్ సపోర్ట్ తో ఇది సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందని అన్నారు అన్నారు చిరంజీవి. ఇదే ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ గా తేజా సజ్జ, సంయుక్త మీనన్ అటెండ్ అయ్యారు.
తేజా సజ్జా తన బిడ్డ లాంటి వాడు తను కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నాడని అన్నారు చిరంజీవి. ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ లు ఎప్ప్పుడు జరిపినా తనని ఇన్వైట్ చేయండి. తాను తప్పకుండా వస్తానని అన్నారు చిరంజీవి. ఐతే ఇప్పుడు తాను పాలిటిక్స్ లో లేని తనని టార్గెట్ చేసిన వాళ్లకు తాను చేసే మంచి పనులు దాని వల్ల లాభపడ్డ వారే సమాధానం ఇస్తారు. తాను ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు చిరంజీవి. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా నిర్ణయించలేదు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమాకు అకాడమీ విన్నర్ కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు.