టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వయసు పెరుగుతున్నా క్రేజ్ అస్సలు తగ్గడం లేదు. ఇకపోతే ఆయన కొత్త సినిమాలు ఒక్కోటి అప్‌డేట్ ఇస్తున్న కొద్దీ హైప్ రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ వరుస ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఎంటర్‌టైనర్, బాబీతో మరో మాస్ ప్రాజెక్ట్, అలాగే విశ్వంభర అనే సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ఇప్పటికే లైన్‌లో ఉన్నాయి.
ఈ సినిమాలు అన్ని విభిన్న జానర్స్‌లో ఉండటంతో ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ దక్కనుంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర, ఇప్పటికే టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిలోనూ పెద్ద అంచనాలు క్రియేట్ చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఫ్యాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్‌తో అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
కీరవాణి సంగీతం, భారీ తారాగణం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. చిరంజీవి 70వ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి తన స్టైల్‌కు సిగ్నేచర్ లాంటి డ్యాన్స్ పోజ్‌తో కనిపించడం ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఫుల్ ఎనర్జీతో, చార్మింగ్‌గా ఉన్న ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో పాటు ఈ పోస్టర్ కూడా సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఇక ఫ్యాన్స్ ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్‌తో విశ్వంభర పోస్టర్‌ను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇది మాత్రం మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి వయసుతో సంబంధం లేకుండా ఇంత స్టైల్‌గా, యంగ్ లుక్‌లో కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. విశ్వంభర సినిమా రిలీజ్ కోసం మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది సమ్మర్ 2026లో ఈ ప్రాజెక్ట్ గ్రాండ్‌గా థియేటర్స్‌కి రానుంది. అప్పటివరకు గ్లింప్స్, పోస్టర్స్, టీజర్స్‌తో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, వరల్డ్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో వస్తోన్న ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని మళ్లీ ప్రపంచానికి చాటనుంది.
మెగాస్టార్ చిరంజీవి అనేది మెగా ఫ్యాన్స్ కి ఒక ఎమోషన్. ఇండియన్ సినిమా హిస్టరీలో చిరంజీవికి ప్రత్యేకమైన పేజీలు ఉంటాయి. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి తనకంటూ మెగా అభిమానుల సంద్రాన్నే ఏర్పాటు చేసుకున్నారు ఆయన. యాక్టర్ అవ్వాలనుకున్న కల సాకారం చేసుకునేందుకు ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా వాడుకున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ముందు చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత సైడ్ రోల్స్, విలన్ రోల్స్ చేసి అక్కడ టాలెంట్ చూపించి లీడ్ రోల్స్ చేస్తూ వచ్చారు.
చిరంజీవి 1978లో కెరీర్ ప్రారంభించారు. ఆయన కెమెరా ముందుకు వెళ్లింది పునాదిరాళ్లు అయినా ముందు రిలీజైంది మాత్రం ప్రాణం ఖరీదు సినిమా. బాపు, కె.బాలచందర్ లాంటి డైరెక్టర్స్ తో కెరీర్ తొలినాళ్లలో పనిచేసిన చిరంజీవి తన కెరీర్ ని ఎలా మలచుకోవాలో డిసైడ్ అయ్యారు. అదే క్రమంలో పున్నమి నాగు, కోతల రాయుడు, మొగుడు కావాలి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. అదే దారిలో చట్టానికి కళ్లులేవు, న్యాయం కావాలి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అభిలాష, మంచు పల్లకి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు చిరంజీవి. ఐతే చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఖైదీ. 1983లో వచ్చిన ఆ సినిమా ఆయన్ను సూపర్ క్రేజ్ తెచ్చింది.
ఖైదీ సినిమా తెలుగు సినిమాల్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఆ సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి తిరుగులేని క్రేజ్ వచ్చింది. చిరంజీవి సినిమాల్లో డ్యాన్సులు స్పెషల్ ఎట్రాక్షన్. ఆయన కొత్త కొత్త స్టెప్పులు ఇంట్రడ్యూస్ చేశారు. అలా స్టెప్పులేస్తూ, యాక్షన్ సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు చిరంజీవి. ప్రాణం ఖరీదు, పునాది రాళ్లు నుంచి భోళా శంకర్ వరకు చిరంజీవి 155 సినిమాల ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరంజీవి కేవలం రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా.. ఆపద సమయాల్లో అభిమానులకు అండగా ఉంటారు చిరంజీవి. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి జీవితాన్ని అందిస్తున్నారు.
ఇక సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను ఇండియన్ గవర్నమెంట్ పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇండియన్ సినిమాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని.. మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ సినిమాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాధించుకున్నారు. ఆయన ఈ స్థానాన్ని అందుకోవడం కోసం ఎంతో కష్టపడ్డారు. స్వయంకృషితో ఎదిగిన మణిషి కాబట్టే ఎక్కడ ఎప్పుడు కించిత్ గర్వం కూడా ఆయనలో ఉండదు. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చే చాలామందికి చిరంజీవే స్పూర్తి.. ఆయన్ను ఇన్ స్ప్రేషన్ గా తీసుకునే సినీ రంగం వైపు వస్తుంటారు. నేడు 70 వ వసంతంలోకి అడుగు పెడుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తుంది టీమ్ news7telugu.కామ్.