చాలా కాలంగా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి నిర్మిస్తున్న చిత్రం తో సుస్మిత నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాతోనే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసారు. ఇదే సంస్థలో ఓటీటీ వెబ్ సిరీస్ లు కూడా భాగస్వామితో కలిసి నిర్మిస్తున్నారు.
అయితే సినిమా నిర్మాణంలోకి మాత్రం డాడ్ సినిమాతో రావడం ఇదే తొలిసారి. చిరంజీవికిది నెంబర్ పరంగా చూస్తే 157వ చిత్రం కావడం విశేషం. మరి ఈ సినిమా హీరోగా నటిస్తోన్న చిరంజీవికి ఆమె ఎంత పారితోషికం ఇస్తున్నారు? అన్నది ఆసక్తికరం. ఇదే తొలి సినిమా కాబట్టి కచ్చితంగా ఎంతో కొంత పారితోషికం చెల్లించాలి. మరి ఆ లెక్క ఎంత అన్నది తేలాలి. మార్కెట్ లెక్కల ప్రకారం ఆయనకు చెల్లించా ల్సింది చెల్లించాల్సిందే.
ఈ సినిమా నిర్మాణంలో సాహుగారపాటి కూడా భాగమవుతున్నారు. సుస్మితతో కలిసి నిర్మిస్తున్నారు. కాబట్టి చిరంజీవికి అడ్వాన్స్ గా ఇద్దరు కలిసి కొంత చెల్లించి ఉండాలి. మిగిలిన మొత్తం చిత్రీకరణ అనంతరం చెల్లిస్తారు. కూతురు కదా? అని చిరంజీవి పారితోషికం విషయంలో కుమార్తెకు ఏమీ ఎలాంటి మినహా యింపులు ఉండవు. చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసినంత కాలం ఆమె కొంత పారితోషికం నిర్మాణ సంస్థల నుంచి అందుకునేవారు. ఇప్పుడు ఆ స్థాయి నుంచి పారితోషికం చెల్లించే స్థాయికి ఎదిగారు. అలాగని కాస్ట్యూమ్ డిజైనర్ వృత్తికి దూరమవ్వరు. తాను నిర్మిస్తున్న సినిమాకు కూడా తానే కాస్ట్యూమ్ డిజైనర్ అని సమాచారం. అలా చేయగల్గితే డిజైనర్ ఖర్చులు లేనట్లే. లేదంటే అదనంగా డిజైనింగ్ కి సంస్థ ఖాతా నుంచి చెల్లించాల్సి ఉంటుంది.