మెగాస్టార్ చిరంజీవి తాజాగా డైరెక్టర్ బాబీకి ఖరీదైన కానుక ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. డైరెక్టర్ బాబీ చిన్నప్పటినుంచి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసినదే. ఇలా చిన్నప్పటినుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ తాను పెరిగానని అలాంటిదే చిరంజీవి గారిని డైరెక్టర్ చేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అంటూ ఇటీవల బాబి ఎంతో ఎమోషనల్ అయ్యారు.
బాబీ డైరెక్షన్లో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చిరు పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. చిరంజీవి ఎనర్జీ, స్క్రీన్ ప్రజెన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విజయం పట్ల ఆనందంగా స్పందించిన మెగాస్టార్ డైరెక్టర్ బాబీకి ఖరీదైన కానుకను ఇచ్చారు.
ఈ క్రమంలోనే చిరంజీవి డైరెక్టర్ బాబీ కోసం ఒమేగా సీమాస్టర్ వాచ్ ని గిఫ్ట్ గా అందించారు. మెగాస్టార్ స్వయంగా బాబీ చేతికి ఈ వాచ్ తొడిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చిరంజీవి కానుకగా ఇచ్చిన ఈ వాచ్ ఖరీదు సుమారు 6 నుంచి 10 లక్షలు వరకు విలువ చేస్తుందని తెలుస్తోంది.
ఇలా చిరంజీవి తనకు ఊహించని విధంగా ఖరీదైన కానుకను ఇవ్వటంతో డైరెక్టర్ బాబీ సైతం సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించి చిరంజీవికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.బాస్ స్వయంగా ఇచ్చిన మెగా సర్ప్రైజ్.. ప్రియమైన మెగాస్టార్ కి ధన్యవాదాలు. ఈ అమూల్యమైన బహుమతి మర్చిపోలేనిది. మీ ప్రేమ, ప్రోత్సాహం మరియు ఆశీర్వాదాలు నాకు ప్రపంచం అన్నయ! నేను ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అంటూ బాబి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.