ఏపీ సీఎం చంద్రబాబు చంద్రబాబు విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన సీఐఐ సదస్సులో అంతా తానై వ్యవహరించారు. పెద్ద ఎత్తున సెషన్లు నిర్వించారు. అలాగే ఒప్పందాలు కూడా ఎన్నో కుదిరాయి. ఇక రాత్రీ పగలు తీరిక లేకుండా బాబు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు వేశారు. విశాఖలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగ మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేసారు.
మొత్తం ఏపీ చరిత్రలో ఒక అయిదేళ్ళ కాలం మాత్రం బ్యాడ్ పీరియడ్ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు 19-24 ఓ బ్యాడ్ పిరియడ్ గా చరిత్రలో ఉంటుందని ఆయన అన్నారు. ఒక వైపు పరిశ్రమల్ని మూసివేయించారు అంతే కాదు చాలా వరకూ ఏపీ నుంచి తరిమేశారు అని ఆయన విమర్శించారు. అంతే కాదు మరో వైపు విద్యుత్ పీపీఏలను రద్దు చేసేసి ఏపీ బ్రాండ్ ను దెబ్బతీశారు అని వైసీపీ మీద తీవ్రంగానే విమర్శలు చేశారు ఏపీలో ఆనాటి పరిస్థితుల మీద ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియచేసిన పరిస్థితి నెలకొంది అని ఆయన అన్నారు. ఇక గత పాలకులు చేసిన తప్పుల కారణంగా విద్యుత్ ఒప్పందాల వల్ల అనవసరంగా కరెంటు వాడుకోకుండానే తొమ్మిది వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది అని ఆయన ఎత్తి చూపించారు.
అయితే ఆ బ్యాడ్ పీరియడ్ నుంచి పుట్టుకొచ్చిన వాటిని తట్టుకుంటూ ఆ వ్యవహారాలన్నిటినీ కేవలం పద్దెనింది నెలల్లోనే సరి చేయగలిగామని ఆయన చెప్పారు. గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ డేటా సెంటర్ రాదు అలా ఏపీలో ఎకోసిస్టం తయారైంది కాబట్టే మరో నాలుగైదు డేటా సెంటర్లు ఏర్పాటుకు ముందుకు వచ్చాయని ఆయన వివరించారు. అంతే కాదు అనేకమైన అనుబంధ పరిశ్రమలు ఏపీకి తరలి విశాఖకు తరలివస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
ఇక సీఐఐ సదస్సు కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే కాదు. మేధోపరమైన చర్చలకు, వినూత్న ఆవిష్కరణల్ని పంచుకునేందుకు కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాను దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తల్ని అదే విధంగా మేధావుల్ని, విదేశీ ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించామని ఆయన తెలిపారు అంతే కాకుండా ఒక 500 మంది విద్యార్ధులను సెలెక్ట్ చేసి ఈ సీఐఐ సదస్సుకు ఆహ్వానించామని తెలిపారు వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని చెప్పారు. రానున్న కాలంలో ఆస్పిరెంట్ ఇండస్ట్రియలిస్ట్స్ గా వారిని మార్చే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈ తరహా సదస్సుల ద్వారా యువత ఆలోచనలు మారాలన్నది కూడా ప్రభుతం ఉద్దేశ్యమని బాబు చెప్పారు. యువత, విద్యార్ధుల ఆలోచనలకు ఈ సదస్సు ఒక వేదిక కావాలన్నదే ప్రభుత్వం ఉద్దేశంగా చంద్రబాబు చెప్పారు. ఇక ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి పరిశ్రమలకు కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ పారిశ్రామిక పార్కుల్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఇక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు అని ఆయన చెప్పారు. అలాగే ఈజ్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చామని అన్నారు. ఈ ప్రయత్నంలో సింగపూర్ ను ఒప్పించి మళ్లీ రాష్ట్రానికి తీసుకువచ్చామని, అమరావతి రాజధానిలో భాగస్వామి కాకపోయినా ఇతర ప్రాంతాల్లో కలిసి పనిచేసేలా సింగపూర్ ని ఒప్పించామని బాబు చెప్పుకొచ్చారు అదే విధంగా చూస్తే కనుక 21 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గత 18 నెలల్లో వచ్చాయని అలాగే వీటి ద్వారా 17 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని బాబు వెల్లడించారు.
ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు విశ్వాసం కల్పించాలనే దేశంలో ఎక్కడా లేనట్టుగా ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేస్తున్నామని కొత్త విషయాన్ని బాబు చెప్పారు. దీనికి సావరిన్ పవర్ ను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 10 ఏళ్లలో 1 ట్రిలియన్ డాలర్లు కోటిమందికి ఉద్యోగాలు తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బాబు అన్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది దీనిని మళ్లీ పునరుద్ధరించుకోవాలని ఆయన అంటున్నారు. అలాగే గుడ్ గవర్నెన్సు డెవలప్మెంట్ పై శ్రద్ధపెడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని మరో మారు చంద్రబాబు గుర్తు చేశారు.
విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో అద్భుతాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. రెండు రోజుల సదస్సులు అనేక సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా… ఈ సదస్సుకు మూడు వేల మంది ప్రతినిధులు రావడం హర్షణీయమన్నారు. పెట్టుబడులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. అవును… ఏపీ ఆర్ధిక రాజధానిగా చెప్పే విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా… ఈ సదస్సులో ఇప్పటివరకూ రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో.. మొతంగా గడిచిన 18 నెలల్లోనే రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. శ్రీసిటీలో మరికొన్ని యూనిట్లను వర్చువల్ గా ప్రారంభించిన ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా… శ్రీసిటీలో 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పిన సీఎం చంద్రబాబు.. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అన్నారు. ఇదే సమయంలో.. త్వరలో శ్రీసిటీకి 6వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని.. ఇక్కడ నుంచే 50 దేశాలకు చెందిన కంపెనీలు పనిచేస్తాయని.. ఫలితంగా సుమారు ఒకటిన్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు!
మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన బ్రూక్ ఫీల్డ్ గ్రూప్ తో ఏపీ ప్రభుత్వం ఒక అవగాహనపై ఒప్పందంపై సంతకం చేసింది. దీన్ని కేవలం పెట్టుబడి అవకాశంగా మాత్రమే చూడకుండా.. రాష్ట్రంలో సహజ వనరులను ఖాళీ చేయకుండా గ్రీన్ ఎనర్జీ ద్వారా డేటా సెంటర్ ను ఎలా నిర్మించొచ్చో తెలుసుకోవడానికి ఒక ప్రధాన అవకాశమని అంటున్నారు. ఈ ఒప్పందంతో ఏపీలో 3 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు కానుంది!
విశాఖలో రెండో రోజు జరుగిన సీఐఐ పెట్టుబడుల సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో రూ.1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులను రేమాండ్ గ్రూపు ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు… 2027నాటికి ఈ మూడు ప్రాజెక్టులూ ప్రారంభిస్తామని రేమాండ్ హామీ ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ ఎండీ గౌతం మైనీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా… స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు 21 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖ సీఐఐ సదస్సులో భాగంగా శుక్రవారం “వారీ” ఛైర్మన్ శ్యాం సుందర్ తో లోకేష్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో… పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యంత అనుకూల ప్రాంతమని ఆయనకు వివరించారు. ఇందులో భాగంగా… సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు ఆపరేటింగ్ పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.


















