పెట్రోల్ బంక్ అంటే కేవలం ఇంధనం నింపుకునే ప్లేస్ మాత్రమే కాకుండా.. ఒక పర్యాటక ప్రదేశం కూడా అయితే ఎలా ఉంటుంది. అలాంటి ఓ అద్భుతమైన పెట్రోల్ బంక్ ఉంది. విశాల ప్రాంగణం, ఆధునిక సౌకర్యాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. సాధారణ పెట్రోల్ బంకులకు భిన్నంగా ఇది ఓ సామ్రాజ్యం. 75 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆహారం, షాపింగ్‌తో అలరించే ఈ అతిపెద్ద పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో తెలుసా ? దాని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకోవడానికి చదవండి!
మనం చూసే పెట్రోల్ బంకుల్లో మహా అయితే పది వరకు ఫిల్లింగ్ పాయింట్స్ ఉంటాయి. కానీ, ఒకేసారి 120 కార్లకు పెట్రోల్ నింపగల అతిపెద్ద బంక్ ఎక్కడ ఉందో తెలుసా ? అది అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగర సమీపంలో ఉంది. దాని పేరు “Buc-ee’s”. ఈ పెట్రోల్ బంక్ 75,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఇందులో కేవలం పెట్రోల్ నింపడమే కాకుండా, ఆహారం, షాపింగ్ కోసం అనేక స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ బంక్ ఇప్పుడు ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది.
ఈ బంక్ విశాలమైన ప్రదేశంలో అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణికులు తమ వాహనాలకు కావాల్సిన ఇంధనం నింపుకోవడంతో పాటు, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. వివిధ రకాల ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయవచ్చు. పెద్ద సంఖ్యలో ఫిల్లింగ్ పాయింట్లు ఉండటం వల్ల వాహనదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, ఇక్కడ ఏర్పాటు చేసిన షాపింగ్ స్టాల్స్‌లో స్థానిక ఉత్పత్తులతో పాటు అంతర్జాతీయ బ్రాండ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Buc-ee’s కేవలం ఒక పెట్రోల్ బంక్ మాత్రమే కాదు. ఇక్కడికి వెళ్లిన వారికి ఓ ప్రత్యేక అనుభవాన్ని కూడా అందిస్తుంది.ప్రయాణికులకు అవసరమైన ప్రతిదీ ఇక్కడ లభిస్తుంది. శుభ్రమైన టాయిలెట్లు, విశాలమైన పార్కింగ్ స్థలం, స్నేహపూర్వక సిబ్బంది ఈ బంక్‌ను మరింత ప్రత్యేకంగా చేస్తాయి. టెక్సాస్‌లో ప్రయాణించే వారికి ప్రస్తుతం ఒక చూడాల్సిన ప్రదేశంగా మారిపోయింది. తన ప్రత్యేకమైన సౌకర్యాలు , భారీ విస్తీర్ణంతో Buc-ee’s ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోల్ బంక్‌గా నిలుస్తుంది.