[10:22 am, 06/05/2025] Jana Journalist: వేశ్యగా నటించాలంటే కాస్తా ధైర్యముండాలి. అది కూడా హీరోయిన్లుగా కెరీర్ ఉన్నప్పుడే ఇలాంటి పాత్రలు చేయడం సాహసమనే చెప్పాలి. గతంలో వేశ్య పాత్రల్లో నటించాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వేశ్య పాత్రల్లో నటిస్తే చాలు ఫుల్ పాపులారిటీ. అనుష్క , ఛార్మీ, శ్రియ మొదలగు హీరోయిన్లు వేశ్య పాత్రల్లో నటించినవారే. ముఖ్యంగా అనుష్క స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే వేశ్య పాత్ర కనిపించింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ”వేదం” సినిమాలో వేశ్యగా నటించి మెప్పించింది.
ఈ సినిమాలో అనుష్క పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. అనుష్క ఇచ్చిన ధైర్యంతో శ్రియ, ఛార్మీ వంటి హీరోయిన్లు సైతం వేశ్యగా నటించారు.తాజాగా మరో హీరోయిన్ వేశ్య పాత్రలో నటించడానికి రెడీ అవుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..బిందు మాధవి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన బిందు మాధవి ఆ తర్వాత నటనలోకి అడుగుపెట్టారు. బిందు మాధవి తొలుత తెలుగు సినిమాల్లో నటించడం ప్రారంభించారు.ఆమె 2008లో శేఖర్ కమ్ముల నిర్మాణంలో అనిష్ కురువిల్లా దర్శకత్వం వహించిన “అవకాయ బిర్యాని” చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు.తర్వాత ఆమె “బంపర్ ఆఫర్” (2009), “రామ రామ కృష్ణ కృష్ణ” (2010), మరియు “ఓం శాంతి” (2010) వంటి తెలుగు చిత్రాల్లో నటించారు.
ఇదే సమయంలో పలు తమిళ సినిమాల్లో ఈ బ్యూటీ నటించింది. 2017లో విజయ్ టీవీలో ప్రసారమైన “బిగ్ బాస్ తమిళం” మొదటి సీజన్‌లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు మరియు నాల్గవ రన్నరప్‌గా నిలిచారు. 2022లో డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమైన తెలుగు రియాలిటీ షో “బిగ్ బాస్ నాన్-స్టాప్” మొదటి సీజన్‌లో ఆమె విజేతగా నిలిచారు. బిగ్ బాస్ తెలుగు ఫ్రాంచైజీలో విజేతగా నిలిచిన మొదటి మహిళ ఆమె. తాజాగా ఈ ముద్దుగుమ్మ వేశ్య పాత్రలో నటించడానికి రెడీ అవుతుంది. దండోరా’ అనే సినిమాలో బిందు మాధవి నటిస్తుంది. ఈ సినిమాలో ఈ చిన్నది వేశ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి వేశ్యగా బిందు మాధవి ఎలా మెప్పిస్తుందో చూడాలి.