బిగ్ బాస్ సీజన్ 9 ఈ సండే నుంచి మొదలవుతుంది. బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీం. అందుకు సంబంధించిన బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా కామన్ మ్యాన్ ఎంపిక జరుగుతుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9కి హౌస్ లోకి వచ్చే సెలబ్రిటీస్ ఎవరన్నది రివీలైంది. ఇప్పటికే వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ బాస్ షోకి సెలబ్రిటీ కేటగిరి కింద ఎంపిక చేస్తారు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈసారి ఇద్దరు హా**ట్ హీరోయిన్స్ వస్తున్నారట. అందులో ఒకరు లక్స్ పాప ఆషా శైనీ అలియాస్ ఫ్లోరా షైనీ కాగా మరొకరు సంజన అని తెలుస్తుంది. ఫ్లోరా షైనీ తెలుగులో నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ సినిమాల్లో నటించింది. కొన్నాళ్లు బీ గ్రేడ్ సినిమాలు కూడా చేసింది. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఆమె రావడంతో హౌస్ లో ఆషా షైనీ ఎలాంటి కంటెంట్ ఇస్తుందా అని ఎగ్జైట్ అవుతున్నారు.
మరోపక్క ప్రభాస్ బుజ్జిగాడు హీరోయిన్ సంజన కూడా బిగ్ బాస్ సీజన్ 9 లో వస్తుంది. ప్రభాస్ తో ఛాన్స్ వచ్చినందుకు హ్యాపీగా ఫీలైనా కూడా సంజనకు ఆ సినిమాతో పెద్దగా క్రేజ్ రాలేదు. కన్నడ, తెలుగు సినిమాల్లో చేసిన సంజన బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సందడి చేయబోతుంది.
ఇక వీరితో పాటు జయం సినిమా కమెడియన్ సుమన్ శెట్టి కూడా బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొంటున్నారు. కమెడియన్ గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన సుమన్ శెట్టి ఈమధ్య పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు. బిగ్ బాస్ తో మళ్లీ అతను ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఇద్దరు పాత హీరోయిన్స్, ఒక ఫేడవుట్ కమెడియన్ ని తీసుకు రావడం జరుగుతుంది. మరి వీరితో షోకి ఎలాంటి కంటెంట్ వస్తుందో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం మొదలు పెట్టడమే ట్విస్ట్, టర్న్ లతో ప్లాన్ చేశారట. ఈ సీజన్ అన్ని సీజన్లలా కాకుండా వేరే లెవెల్ లో ఉంటుందట.
బిగ్ బాస్ సీజన్ 9 లో ఆశా షైనీ, సంజన, సుమన్ శెట్టి లాంటి వాళ్లు హౌస్ లోకి వస్తున్నారు. మరి వారి టాలెంట్ తో ఎవరు ప్రేక్షకులను మెప్పిస్తారన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీస్ కు ఏమాత్రం తీసిపోని విధంగా కామన్ మ్యాన్ ని రెడీ చేసి వదులుతున్నారు బిగ్ బాస్ టీం.