బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో మొదలు కాబోతుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 7 ఆదివారం గ్రాండ్ గా సీజన్ 9 మొదలు పెడతారట. హోస్ట్ నాగార్జున కూడా ఈ సీజన్ ని రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 కి వచ్చే కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ ని ఇప్పటికే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వాళ్ల సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఐతే ఆ 15 మెంబర్స్ లో కేవలం ఐదుగురికి మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వస్తుందని తెలుస్తుంది. ఐతే ఆ లక్కీ 5 ఎవరన్నది తెలియాలంటే షో మొదలయ్యే రోజు దాకా వెయిట్ చేయాల్సిందే.
ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో పార్టిస్పేట్ చేస్తున్న సెలబ్రిటీ కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఒకటి బయటకు వచ్చింది. హౌస్ లోకి దాదాపు 9 మంది సెలబ్రిటీస్ వెళ్తారని తెలుస్తుండగా వాళ్లలో 8 మంది దాదాపు కన్ ఫర్మ్ కంటెస్టెంట్స్ పేర్లు బయటకు వచ్చాయి. అందులో కొందరు సీరియల్ యాక్టర్స్ కాగా కొందరు ఒకప్పటి హీరోయిన్స్ ఉన్నారు. మరికొందరు కమెడియన్స్ ఉన్నారు. ఐతే ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 ఎంట్రీ కన్ ఫర్మ్ అని తెలుస్తుంది.
ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్న వాళ్లు..
సీరియల్ యాక్టర్ భరణి శంకర్ కూడా సీజన్ 9 బిగ్ బాస్ కి వెళ్తున్నారట. సీరియల్ యాక్ట్రెస్ తనూజ కూడా హౌస్ లోకి వస్తారని తెలుస్తుంది. ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆషా శైనీ కూడా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ద్వారా ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. లక్స్ పాపగా ఆమె తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయం. ఇక కన్నడ హీరోయిన్ సంజన కూడా సీజన్ 9 సెలబ్రిటీ కేటగిరిలో హౌస్ లోకి వస్తున్నారట.
వీరితో పాటు డ్యాన్స్ మాస్టర్ శ్రేష్టి వర్మ కూడా బిగ్ బాస్ సీజన్ 9 కి వస్తున్నారని తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన అలేఖ్యా పికిల్స్ రమ్య కూడా బిగ్ బాస్ సీజన్ 9 కి వస్తారని టాక్. ఈమె ఒక్క విషయంలో కన్ ఫర్మేషన్ రాలేదు. మిగతా వాళ్లంతా కూడా దాదాపు కన్ ఫర్మ్ అన్నట్టే అని తెలుస్తుంది. ఇక వీరితోనే బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి వచ్చే ఐదుగురు కంటెస్టెంట్ పోటీ పడతారు.