బిగ్ బాస్ లోకి కామన్ మ్యాన్ ని పంపించాలనే ఆలోచన ముందు నుంచి ఉంది. ఐతే కామన్ మ్యాన్ ఒక్కడే కాదు ఎక్కువమందిని పంపించాలనే ప్లానింగ్ తో సీజన్ 9 లో కొత్తగా ప్లాన్ చేశారు. కామన్ మ్యాన్ నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి వాళ్లలో నుంచి 45 మందిని వడకట్టి అందులో నుంచి టాప్ 15 ని ఫైనల్ చేశారు జ్యూరీ మెంబర్స్ నవదీప్, అభిజిత్, బిందు మాధవి. శ్రీముఖి హోస్ట్ గా బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ షో మొదలు పెట్టారు. దాదాపు 12 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ షోకి మంచి బజ్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్లే ఐదారుగురు కంటెస్టెంట్స్ ఇందులో ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 9 మొదలవుతుంది..
ఐతే నేటితో బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో పూర్తైంది. బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం మొదలవుతున్న సందర్భంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష ముగించారు. ఐతే సీజన్ 9 లో టాప్ 13 నుంచి ఐదుగురు లేదా ఆరుగురు హౌస్ లోకి వెళ్తారు. అది ఎవరన్నది ఆడియన్స్ ఓటింగ్ తో పాటు బిగ్ బాస్ అగ్నిపరీక్ష జ్యూరీ ఇచ్చిన లిస్ట్ ని బట్టి ఉంటుంది. ఐతే బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో నేటితో ముగిసింది.
అగ్నిపరీక్షలో మహా పరీక్ష అంటూ ఒక టాస్క్ నిన్నటి నుంచి నడుస్తుంది. ఈ టాస్క్ లో ఫైనల్ గా మనీష్ మర్యాద గెలిచాడు. దాంతో అతనికి స్టార్ తో పాటు ఓట్ అప్పీల్ ఛాన్స్ కూడా వచ్చింది. అలా మనీష్ అగ్నిపరీక్షలో లాస్ట్ టాస్క్ గెలిచి ఓట్ అప్పీల్ ఛాన్స్ అందుకున్నాడు. ఈరోజు అగ్నిపరీక్ష ఎపిసోడ్ కి సత్యదేవ్ అలా వచ్చి ఇలా వెళ్లాడు. అగ్నిపరీక్ష లో తన రావు బహుదూర్ టీజర్ రిలీజ్ చేసి వెళ్లాడు.
13 మందిలో ఎవరు హౌస్ లోకి..
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఇంతటితో ముగిసింది. ఇక 13 మంది కంటెస్టెంట్స్ లో ఎవరు హౌస్ లోకి వెళ్తారన్నది ఆదివారం తెలుస్తుంది. కామన్ మ్యాన్ కేటగిరి నుంచి వచ్చినా కూడా అగ్నిపరీక్ష ద్వారా వీళ్లు కూడా సెలబ్రిటీస్ అయ్యారు. ఓ విధంగా ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా వాళ్లకు ప్లస్ అయ్యేలా ఉంది.
ఇక బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్లే కామన్ మ్యాన్ లో దమ్ము శ్రీజ, హరీష్, మనీష్, ప్రియ, దివ్య, నాగ ప్రశాంత్, పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ ఉన్నారు. ఐతే వీరిలో నాగ ప్రశాంత్, డెమాన్ పవన్ డౌట్ లో ఉన్నారు. మిగిలిన వాళ్లు హౌస్ లోకి వెళ్లడం దాదాపు కన్ ఫర్మ్ అన్నట్టే తెలుస్తుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి హౌస్ లోకి వెళ్లే వారికి ఆల్రెడీ ఓట్ ఏర్పడింది కాబట్టి వాళ్లు ఏ కొద్ది పాటి ఆట ఆడినా కచ్చితంగా వాళ్లకు చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.