మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ బోర్స్ ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంది. విజయ్ కింగ్ డం తో పాటు రామ్ తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో నటిస్తున్న భాగ్య శ్రీ ఈ రెండు సినిమాలతో తెలుగులో పాపులారిటీ సంపాధించాలని చూస్తుంది. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా ఈ నెల చివరన రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పై అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది.
గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన కింగ్ డమ్ సినిమాలో భాగ్య శ్రీ రోల్ కూడా ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు. సినిమాలో ఆమె విజయ్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపిస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన హృదయం లోపల సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు విజయ్ తో భాగ్య శ్రీ లిప్ లాక్ కూడా సూపర్ హిట్ అయ్యింది. భాగ్య శ్రీ తెలుగులో చేసిన తొలి సినిమా మిస్టర్ బచ్చన్ నిరాశపరచింది.
ఆ సినిమా ఫ్లాపైనా అమ్మడికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఐతే టాలీవుడ్ లో తొలి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఉంది భాగ్య శ్రీ. అది విజయ్ కింగ్ డమ్ తోనే సాధించాలని చూస్తుంది. కింగ్ డమ్ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే తప్పకుండా హిట్టు పడేలా ఉంది. ఐతే ఈ సినిమాతో నిజంగానే హిట్టు పడితే భాగ్య శ్రీ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కింగ్ డం మాత్రమే కాదు రామ్ సినిమాతో కూడా భాగ్య శ్రీ యూత్ ఆడియన్స్ కి మరింత దగ్గర కానుంది. ఈ రెండు సినిమాలు అనుకున్న రేంజ్ సక్సెస్ పడితే భాగ్యానికి ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు. భాగ్య శ్రీ మాత్రం ఈ సినిమాల మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సినిమాల్లో యాక్టింగ్ తో పాటు గ్లామర్ విషయంలో కూడా వెనక్కి తగ్గని భాగ్య శ్రీ కింగ్ డమ్, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాల్లో గ్లామర్ షోతో కూడా అలరిస్తుందని తెలుస్తుంది. హిట్టు పడకపోతేనే అమ్మడు ఈ రేంజ్ ఫాం కొనసాగిస్తుంటే ఇక సూపర్ హిట్ పడితే మాత్రం భాగ్య శ్రీ పంట పడినట్టే అని చెప్పొచ్చు.