గత కొన్ని రోజులుగా భారత్ వ్యతిరేక వాక్ చాతుర్యం బంగ్లాదేశ్ లో బలంగా వినిపిస్తూ అది రోజు రోజూకీ తీవ్రంగా మారుతోన్న పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో.. బంగ్లాదేశ్ అంతటా భూమిపై భారత వ్యతిరేక నిరసనలు చెలరేగుతున్నాయి. మరోవైపు సముద్రంలో కూడా ఉద్రిక్తతలు చెలరేగడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో.. ముందు ముందు ఎలాంటి పరిణామాలు నెలకొంటాయనేది కీలకంగా మారింది.
అవును.. ఓ పక్క బంగ్లాదేశ్ అంతా భూమిపై భారత వ్యతిరేక నిరసనలు చెలరేగుతుండగా.. సముద్రంలో కూడా అలజడులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా.. బంగాళాఖాతంలోని భారత జలాల్లోకి బంగ్లాదేశ్ ఫిషింగ్ ఓడల అనధికారిక ఎంట్రీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నావికాదళానికి చెందిన గస్తీ నౌక.. 16 మంది మత్స్యకారులతో ప్రయాణిస్తున్న భారతీయ ట్రాలర్ ను ఢీకొట్టింది. దీంతో.. అది బోల్తా పడింది.
దీంతో పరిస్థితులు ఒక్కసారిగా తీవ్రమయ్యాయి. బంగ్లాదేశ్ నేవీ నౌక బెంగాల్ కు చెందిన 16 మంది మత్స్యకారులతో ప్రయాణిస్తున్న భారత ట్రావెలర్ ను సముద్ర సరిహద్దు సమీపంలో ఢీకొట్టింది. ఆ సమయంలో బంగ్లా నౌక లైట్లు ఆపివేయబడిందని, దీంతో రాత్రి పూట భారత ట్రాలర్ దాన్ని గుర్తించడం అసాధ్యం అయ్యిందని అంటున్నారు. వాస్తవానికి ఈ ఘటన సోమవారమే జరగ్గా తాజా పరిణామాల నడుమ వెలుగులోకి వచ్చింది.
బంగ్లా నౌక ఢీకొట్టడంతో భారత ట్రాలర్ పడవ బోల్తా పడిపోయింది. దీంతో భారత మత్స్యకారులంతా సముద్రంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో భారత తీర రక్షక దళం 11 మంది మత్స్యకారులను రక్షించగలగగా.. మిగిలిన ఐదుగురి ఆచూకీ ఇప్పటికీ కనిపించలేదని చెబుతున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం అందులో ఒక మత్స్యకారుడిని ఈటె వంటి ఆయుధంతో చంపారంట!
ఈ సందర్భంగా… మా అందరినీ చంపడానికి ప్రయత్నం జరిగిందని.. తాము వల వేయడానికి సిద్ధమవుతుండగా బంగ్లా నౌక ట్రాలర్ ను ఢీకొట్టిందని.. ఈ సమయంలోనే రాజ్ దుల్ అలీ అనే వ్యక్తిని ఈటె తో చంపారని ప్రాణాలతో బయటపడిన ఓ మత్స్యకారుడు చెప్పినట్లు కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో ఫిషర్మెన్ వర్కర్స్ యూనియన్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఇక.. గురువారం రాత్రి నుంచి జరుగుతున్న తీవ్ర పరిణామాలు.. పైగా వచ్చే ఏడాది అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బంగ్లాదేశ్ – భారత్ మధ్య ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయనేది చర్చనీయాంశంగా మారింది.
చట్టోగ్రామ్ పోర్ట్ నగరంలోని ఖుల్షీ ప్రాంతంలో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట నిరసనకారులు గుమిగూడారు. హాది హత్యను ఖండిస్తూ, అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులను కార్యాలయ ప్రాంగణం నుంచి చెదరగొట్టారు. అక్కడే భారీగా మోహరించారు.హైది మరణ వార్త తెలియగానే కోపంతో ఉన్న ప్రజలు నిరసనలు చేపట్టారు. నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులు హాది భద్రతలో అధికారుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఆగ్రహంతో ఉన్న కొంతమంది నిరసనకారులు డైలీ ప్రథమ్ ఆలో కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత ది డైలీ స్టార్ పై దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ కార్యాలయంలో పలువురు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లిన నిరసనకారులు అడ్డుకున్నారు. ఇక భవనంలో చిక్కుకున్న వారిని తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కార్యాలయం నుంచి సురక్షితంగా బయటకు తీసుకున్నట్లు స్థానిక వార్తపత్రిక పేర్కొంది.
ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హైది సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. గత శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పుల జరిపారు. తీవ్రంగా గాయపడిన హైదిని మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మరణవార్త విన్న అనంతరం ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. హైది ఇటీవల భారతదేశ మ్యాప్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఈ క్రమంలో ఆయన మృతితో బంగ్లాదేశ్‌లో గురువారం అర్ధరాత్రి నుంచి భారత వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి మహ్మద్ యూనస్ శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ సంతాప దినంగా ప్రకటించి, దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. హైది మరణానికి కారణమైన వారికి వదిలపెట్టబోమని హెచ్చరించారు.


















