నవంబర్ వెళుతోంది.. డిసెంబర్ లో అడుగుపెడుతున్నాం. ఈ క్షణం నుంచి డిసెంబర్ 31 రాత్రి సెలబ్రేషన్స్ గురించి యూత్ ఎక్కువగా ఆలోచిస్తోంది. చాలా మంది సెలబ్రిటీలు క్రిస్మస్ తో పాటు, కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునేందుకు దేశ విదేశాల్లోని ఎగ్జోటిక్ లొకేషన్లకు బయల్దేరుతున్నారు. ఇలాంటి సమయంలో భారతదేశంలో రికార్డులు బ్రేక్ చేసేందుకు వస్తోంది ఒక హాలీవుడ్ సినిమా. అది కచ్ఛితంగా జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3.
అవతార్: ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న విడుదల కానుంది. అవతార్ ఫ్రాంఛైజీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం మునుపటి భాగాల కంటే భారీ యాక్షన్ తో రక్తి కట్టిస్తుందని కామెరూన్ ఇప్పటికే ప్రకటించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులను తిరగరాస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.
అయితే అవతార్ 3 ముందస్తు బుకింగుల పరిస్థితి భారతదేశంలో ఎలా ఉంది? ఇక్కడ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అసాధారణంగా ఉండటానికి ఛాన్స్ ఉందా? అనేది ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అవతార్ ఫ్రాంఛైజీలో అవతార్ 1, అవతార్ 2 భారతదేశంలో అద్భుత వసూళ్లను సాధించాయి. 2022లో `అవతార్: ది వే ఆఫ్ వాటర్` మొదటి రోజు దాదాపు రూ. 39.90 కోట్లు వసూలు చేసింది. ఇది `అవెంజర్స్: ఎండ్‌గేమ్` తర్వాత భారతదేశంలో రెండవ అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా రికార్డులకెక్కింది. తదుపరి పార్ట్ 3ని మొదటి రెండు భాగాల కంటే అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే బుకింగులు కొంత నెమ్మదిగా ఉన్నాయి. దీనివల్ల ఓపెనింగ్ డే భారతదేశంలో 35 కోట్లు మించకపోవచ్చని భావిస్తున్నారు.
అయితే రెండో భాగం కోసం దాదాపు 13 ఏళ్లు వేచి చూసిన ఆడియెన్ సినిమా థియేటర్లలోకి రాగానే ఉత్కంఠగా టికెట్లు బుక్ చేసారు. దీని కారణంగా ఓపెనింగ్ డే 39కోట్లు వసూలైంది. అయితే ఆరంభ వసూళ్లతో సంబంధం లేకుండా అవతార్ 3 భారతదేశంలో 500కోట్లు గ్యారెంటీగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. బుక్ మై షోలో 12లక్షలు పైగా ప్రజలు ఈ సినిమా చూడటానికి ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. అందువల్ల ఓపెనింగ్ ల సంగతి ఎలా ఉన్నా కానీ, అవతార్ 3 గ్రాండ్ సక్సెసవుతుందని అంచనా వేస్తున్నారు.


















