దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్పటి వరకు దేశంలోని ఏ రాష్ట్రానికీ దక్కని లక్కును చేజిక్కించుకుని.. సగర్వంగా నిలిచింది. ఈ రికార్డుకు కారణం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమేనని తెలుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో ఉన్న సీఎం చంద్రబాబు.. ఇప్పటికి గత 15 మాసాల్లో 9 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు తెచ్చారు. వీటి వల్ల 4 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా లభించాయని చెబుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ఒకేసారి 1.14 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయి. ఇవి పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. అంతేకాదు.. దేశంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. ఇక, ఈ పెట్టుబడుల ద్వారా ఒకే సారి 87 వేల మందికి ఉద్యోగాలు.. అదేసంఖ్యలో ఉపాధి అవకాశాలు కూడా దక్కనున్నాయి. తద్వారా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రక్రియలో ఈ పెట్టుబడులు కీలక పాత్ర పోషించనున్నాయి.
కాగా.. గడిచిన 15 మాసాల్లో సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు పలు సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించారు. అదేసమయంలో అమెరికాకు చెందిన గూగుల్, మస్క్ వంటి వారికి ఆతిథ్య రంగంలో అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఎలాన్ మస్క్ తొలినాళ్లలో ఇంట్రస్ట్ చూపించినా.. తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. ఇక, బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇంధన, పర్యాటక రంగంతో పాటు పీ-4లోనూ పెట్టుబడులు పెట్టనుంది.
పెట్టుబడి పెట్టే కంపెనీ: రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్(గూగుల్ అనుబంధ సంస్థ)
ఎక్కడ పెట్టుబడి పెట్టనుంది: విశాఖపట్నంలో
మొత్తం పెట్టుబడి: 87,520 కోట్ల రూపాయలు, దీనికి అనుబంధంగా 18 లక్షల కోట్లు కూడా.
ఏర్పాటు చేసే కంపెనీలు.. : భారీ డేటా సెంటర్, ఇన్ఫోటెక్ మూడు క్యాంపస్‌లు, ఐటీలో మేలి మలుపుగా మారనుంది.
దేశంలో ఇప్పటి వరకు అతి పెద్ద పెట్టుబడి: ఉత్తరప్రదేశ్‌లోని అమెరికా సంస్థ. మొత్తం 47 వేల కోట్ల రూపాయలు.