ప్రపంచ రాజధాని అమరావతి అన్నది టీడీపీ స్లోగన్. ఆ పార్టీ అలాగే దానిని చూస్తూ ముందుకు చేస్తూ సాగుతోంది. అమరావతి రాజధాని కనుక పూర్తి అయితే అద్భుతాలు జరిగి ఏపీ అన్ని విధాలుగా ముందుకు సాగుతుందని కూడా కూటమి ప్రభుత్వ సారధి చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతి ఒక్కటి చాలు సంపద సృష్టికి ఎంతో కీలకమవుతుందని కూడా ఆశగా ఉన్నారు.
అమరావతి చుట్టూ :
అమరావతి రాజధాని విషయంలో ఎన్ని అనుకూలతలు ప్రభుత్వం చూపిస్తోందో విపక్షాల నుంచి అన్ని రకాల విమర్శలు వస్తూనే ఉంటాయి. అమరావతిలో అవినీతి దందా నడుస్తోందని చదరపు అడుగుకు పది వేల రూపాయలు వంతున ఖర్చు చేస్తున్నారు అని జగన్ లీగల్ సెల్ మీటింగులో ఆరోపించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట దోపిడికి తెర తీశారని ఫైర్ అయ్యారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అయితే అమరావతి వాస్తు బాగాలేదని అంటున్నారు. అమరావతి ఎత్తిగిల్లడం కష్టమని జోస్యం చెబుతున్నారు.
విరాళాలు అంటూ :
అమరావతి రాజధాని కోసం విరాళాలు చందాలు సేకరిస్తున్నారు అని ఇపుడు సరికొత్త వార్తా కధనాలు వస్తున్నాయి. అమరావతి కోసం నిధులు జనాలను కోరుతున్నారని ప్రచరం సాగుతోంది అమరావతి రాజధానికి నిధుల లేమి ఉందని అందుకే జనాల నుంచి విరాళాలు కోరుతున్నారని వార్తలు దట్టిస్తున్నారు దీని మీదనే ఇపుడు అతి పెద్ద చర్చ సాగుతోంది.
ప్రజా భాగస్వామ్యం కోసమే:
అప్పులు దొరకక విరాళాలు సేకరిస్తున్నారు అన్నది పచ్చి అబద్ధమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజా భాగస్వామ్యం ఉండాలనే గతంలో మై బ్రిక్ మై అమరావతి అని ప్రారంభించామని గుర్తు చేశారు. పది రూపాయలు ప్రతీ వారు ఇటుక కోసం విరాళాలు ఇచ్చారని చెప్పారు. ఇపుడు కూడా అదే విధానం కొనసాగుతుందని మంత్రి నారాయణ చెప్పారు అప్పులు దొరకలేదు అని అమరావతికి నిధులు లేవని చెప్పడం పూర్తిగా తప్పు అని ఆయన ఖండించారు.
మూడేళ్ళలో అమరావతి పూర్తి :
అమరావతి రాజధాని నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని అంటున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 2026మార్చి నెలాఖరుకు అధికారులు,ఉద్యోగులకు సంబంధించి నాలుగు వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. కాలువలు,రిజర్వాయర్ల పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా కార్యచరణతో ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. మొత్తానికి అమరావతి ఆల్ ఈజ్ వెల్ అని మంత్రి చెబుతూ అమరావతి మీద ఎన్ని కుట్రలు చేసినా తాము ముందుకు తీసుకుని వెళ్తామని ఆ సత్తా తమకు ఉందని అన్నారు.