ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

గోదావరి, కృష్ణ,పెన్నా డెల్టాల ఆధునీకరణతోనే జల వనరుల సద్వినియోగం ముంపు సమస్యకు పరిష్కారం. – అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు.

గోదావరి, కృష్ణ,పెన్నా డెల్టాల ఆధునీకరణతోనే జల వనరుల సద్వినియోగం ముంపు సమస్యకు పరిష్కారం. – అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు.
ADVERTISEMENT

ఏనాడో బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన రాష్ట్రంలోని డెల్టాల ఆధునీకరణ ద్వారానే రాష్ట్రంలోని జల వనరులను సద్వినియోగం చేసుకోగలమని, ముంపు సమస్యలను పరిష్కరించుకోగలమని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కాలువల్లో కలుపు, ఆక్రమణలు, శివారు భూములకు నీరు అందకపోవడం, పైనున్న భూములు ముంపుకు గురవటం వంటి సమస్యలను బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో పలువురు సభ్యులు ప్రస్తావించిన ప్రశ్నలకు మంత్రి రామానాయుడు సుస్పష్టమైన సమాధానం ఇచ్చారు.

కృష్ణ, గోదావరి బేసిన్లలోని మురుగు కాలువలు, పంట కాలువలు ఇంచుమించు అన్ని కూడా కొల్లేరు లోకే వస్తున్నాయి. ఈ నీరంతా కూడా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి కలవాల్సి ఉంది. అయితే కాలువలు ఆక్రమణలతో కుంచించుకుపోవడం, కలుపు మొక్కలతో నిండిపోవడం వంటి కారణాలు మూలంగా ప్రవాహం ముందుకు సాగటం లేదు. అందువల్ల కృష్ణ గోదావరి, కొల్లేరు బేసిన్ల లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని డెల్టాల పరిధిలో కాలువలు, డ్రైన్లు డ్రెడ్జింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సలహా ఇచ్చినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

ఇందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయమని కూడా ఆయన తమకు సూచించారు. కాలువల్లో కలుపు తొలగింపు, లాకులు, షట్టర్లు డోర్లు మరమ్మత్తు పనులు, గ్రీజు పెట్టడం వంటి పనుల నిర్వహణకు సంబంధించి ప్రతి ఏటా మార్చిలో ప్రతిపాదనలు తయారు చేయడం,ఏప్రిల్ లో టెండర్లు పిలవడం, మే నెలలో పనులు చేయటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దీనిని గత జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఓ అండ్ ఎం పనులు అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాని దుస్థితి లోకి వెళ్ళిపోయారు. అలాగే నీటిపారుదల వ్యవస్థ నిర్వహణలో లష్కర్ల పాత్ర చాలా కీలకం. ఒకప్పుడు ఎనిమిది వేల మంది ఉండే లష్కర్లు నేడు 600 మంది కి చేరిపోయారంటే జగన్ అరాచక పాలనకు అద్దం పడుతుంది.

నేడు లాకులు షట్టర్లు ఎత్తాలన్నా దింపాలన్నా, లాకుల్లో గ్రీజ్ పెట్టాలన్నా ఆ పనులు ఏఇలు చేయాల్సి వస్తుంది. ప్రతి కిలోమీటర్ కాలువకు ఒక లస్కర్ ఉండాలనే పాత సాంప్రదాయ పద్ధతిని కొనసాగిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.

సాగునీటి సంఘాలతో సత్ఫలితాలు వస్తూనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు సభకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాలకు సంబంధించి 60 వేల మంది ఆయకట్టు రైతులకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. వీరంతా ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పనిచేస్తూ కాల్వల సమర్థ నిర్వహణకు సాయపడుతున్నారని మంత్రి చెప్పారు. కొన్ని నియోజకవర్గాలలో నీటి సంఘాల చైర్మన్లు, సభ్యులు వాళ్ళ సొంత నిధులతో అత్యవసర పనులు చేసుకోవడం ఎంతో ముదావహ మన్నారు.

సాగునీటి సంఘాల గొప్ప వ్యవస్థను జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో నీరు కార్చింది అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు యుద్ధ ప్రాతిపదికన సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి నీటిపారుదల రంగంలో రైతులకు భాగస్వామ్యం కల్పించామని మంత్రి స్పష్టం చేశారు. ఓ అండ్ ఎం పనులు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల అనేక అవకతవకులు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వర్షాకాలంలో ఓ అండ్ ఎం పనులు చేసి, కొన్నిచోట్ల అసలు చేయకుండానే బిల్లులు కాజేసిన అనేక ఉదంతాలు నా దృష్టికి వచ్చాయి. అలాంటి సందర్భాల్లో అక్కడ ఉన్న బాధ్యుల్ని సస్పెండ్ చేస్తామని హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 5 లక్షల లోపు ఓ అండ్. ఎం పనులు, ఇతర అత్యవసర పనులు నీటి సంఘాలకు నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చే పద్ధతి ఇప్పుడు ఉంది. ఈ మొత్తాన్ని 10 లక్షలు పెంచి ఆ పనులను నీటి సంఘాల తోటే చేయించే ఆలోచన కూడా ముఖ్యమంత్రి మదిలో ఉందని నిమ్మల చెప్పారు.

Tags: #APAssembly2025#ManaPalakolluManaRamanaidu#ministernimmla#MLA#NimmalaRamaNaidu#waterresources
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

‘కింగ్స్టన్’ ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఇంకెంత అద్భుతంగా ఉంటుందో – హీరో నితిన్

Next Post

బోరివలి-థానే సొరంగం ప్రాజెక్టులో బ్యాంక్ గ్యారెంటీని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం నిర్వహణపై బాంబే హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది

Related Posts

#ChandrababuNaidu,#APGovernment,#CollectorsConference,#Amaravati,#BusinessReformerOfTheYear,#AndhraPradesh,#GreenEnergy,#DataCenters,#RoyalEnfield,#Tirupati,#Satyavedu,#APDevelopment,#NTRBharosa,#Farmers,#Fishermen,#EducationReforms,#Investments,#AutomobileHub,#CMChandrababu,#APNews,#TeluguNews,#AmaravatiNews,#AndhraPolitics,#Development,#Jobs,#IndustrialGrowth,#WelfareSchemes,#APBrand
Andhra Pradesh

Amaravati:నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. ఏపీకి రాయల్ లుక్!

VeligondaProject
Andhra Pradesh

VeligondaProject:వెలిగొండ టన్నెల్స్‌లో 20 గంటలు.. పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి నిమ్మల

TTD
Andhra Pradesh

TTD:టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు – చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన వరుస ఆమోదాలు

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:లోకేష్ లీడర్‌షిప్‌తో విద్యలో మార్పు, ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతోంది

NEET2026:నీట్ యూజీ-2026 పరీక్షలు సమయానికి, అంతరాయాలు లేకుండా నిర్వహించాలి – వి. నరేంద్రబాబు విజ్ఞప్తి
Andhra Pradesh

NEET2026:నీట్ యూజీ-2026 పరీక్షలు సమయానికి, అంతరాయాలు లేకుండా నిర్వహించాలి – వి. నరేంద్రబాబు విజ్ఞప్తి

APCabinet
Andhra Pradesh

APCabinet:అమరావతి అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ – చంద్రబాబు దిశానిర్దేశంతో రాష్ట్రానికి కొత్త ఊపు

Next Post
బోరివలి-థానే సొరంగం ప్రాజెక్టులో బ్యాంక్ గ్యారెంటీని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం నిర్వహణపై బాంబే హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది

బోరివలి-థానే సొరంగం ప్రాజెక్టులో బ్యాంక్ గ్యారెంటీని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం నిర్వహణపై బాంబే హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ChaithraAchar

ChaithraAchar:Fauziలో కీలక పాత్రలో చైత్ర ఆచార్.. టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తి

#ChandrababuNaidu,#APGovernment,#CollectorsConference,#Amaravati,#BusinessReformerOfTheYear,#AndhraPradesh,#GreenEnergy,#DataCenters,#RoyalEnfield,#Tirupati,#Satyavedu,#APDevelopment,#NTRBharosa,#Farmers,#Fishermen,#EducationReforms,#Investments,#AutomobileHub,#CMChandrababu,#APNews,#TeluguNews,#AmaravatiNews,#AndhraPolitics,#Development,#Jobs,#IndustrialGrowth,#WelfareSchemes,#APBrand

Amaravati:నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. ఏపీకి రాయల్ లుక్!

Telangana

Telangana:హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు కేంద్రం ఆమోదం ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

TamilNaduPolitics

TamilNaduPolitics:విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..? తమిళ రాజకీయాల్లో సంచలనం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info