స్వీటీ అనుష్క `ఘాటీ` ప్రచారానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతున్నా? కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారం చేయలేదు. దీంతో ప్రచారం బాధ్యత లన్నీ నిర్మాతలే తీసుకున్నారు. నిజానికి ఈ చిత్ర దర్శక, నిర్మాతలు అనుష్కకు మంచి స్నేహితులు. ఎంతో కాలంగా ఉన్న పరిచయం కూడా. వీటి కారణంగానైనా అనుష్క ఈ చిత్రాన్ని తప్పక ప్రచారం చేయాలి. కానీ తాను మాత్రం తొలి నుంచి దూరంగానే ఉంది. సినిమా మొదలైన నాటి నుంచి నేటి వరకూ ప్రచారం అనే మాట లేకుండా ఉంది.
షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమాతో తనకు సంబంధం లేనట్లే వ్యవహరించింది. దీంతో అనుష్క ప్రచార పరంగా సంచలన నిర్ణయం తీసుకుందనే మీడియా కథనాలు అంతే వెడెక్కించాయి. `ఘాటీ` మాత్రమే కాదు భవిష్యత్ లో ఇంకే సినిమా ప్రచారంలో కూడా పాల్గొనేది లేదని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. నయనతారలా తాను కూడా ఎలాంటి ప్రచారం లో పాల్గొనకూడదని నిర్ణయిం తీకున్నట్లు కథనాలొచ్చాయి. కానీ తాజాగా అనుష్క వివరణ తో అవన్నీ కట్టు కథనాలేనని తేలిపోయింది.
తాను కేవలం తన వ్యక్తిగత కారణాలగానే ప్రచారానికి దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. ఏ సినిమానైనా ప్రమోటం చేయడం అన్నది తాను బాధ్యతగానే భావిస్తానంది. భవిష్యత్ లో తప్పకుండా మళ్లీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానంది. ప్రచారం అనేది నటిగా తనపై ఉన్న బాధ్యతగా తెలిపింది. దీంతో దర్శక, నిర్మాతలకు అనుష్క సమాధానం బిగ్ రిలీఫ్ లాంటింది. అనుష్క మీడియా ముందుకొచ్చి ఓ సినిమా గురించి ప్రచారం చేసిందంటే కోట్లాది మందికి చేరుతుంది. నిర్మాతలకు కోట్ల రూపాయలు ఖర్చు ఆదా అవుతుంది.
అనుష్క లేకుండా ఎంత ఖర్చు పెట్టినా? అది వృద్ధా ఖర్చు తప్ప జనాలకు ఆ సినిమా చేరదు. అనుష్కతో సినిమాలు చేయాలనుకునే వాళ్లందరికీ ఇదొక మంచి శుభవార్త. అనుష్క వెరీ డౌన్ టూ ఎర్త్. తానెంత పెద్ద స్టార్ అయినా సింపుల్ గా ఉంటుంది. పారితోషికం పరంగా నిర్మాతలకు అందుబాటులో ఉంటుంది. డిమాండ్ ఉందని నిర్మాతను అధికంగా డిమాండ్ చేసే నటి కాదు. అందుకే టాలీవుడ్ లో స్వీటీగా ఫేమస్ అయింది.