20 ఏళ్లుగా దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న అగ్రహీరోయిన్ అనుష్క శెట్టి ఇప్పటికీ టాప్ లీగ్‌లో కొనసాగుతోంది. అనుష్క తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది హీరోయిన్‌లు ఇప్పటికే పెళ్లి చేసుకుని కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టినప్పటికీ, స్వీటి మాత్రం తనకు నచ్చిన దారిలో సాగుతూ కెరీర్‌ను కొనసాగిస్తోంది.
20 ఏళ్లుగా దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న అగ్రహీరోయిన్ అనుష్క శెట్టి ఇప్పటికీ టాప్ లీగ్‌లో కొనసాగుతోంది. అనుష్క తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది హీరోయిన్‌లు ఇప్పటికే పెళ్లి చేసుకుని కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టినప్పటికీ, స్వీటి మాత్రం తనకు నచ్చిన దారిలో సాగుతూ కెరీర్‌ను కొనసాగిస్తోంది. 2005లో నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేసిన అనుష్క, తన అందంతో, అభినయంతో తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. స్టార్ హీరోలందరితో కలిసి హిట్టైన సినిమాలు చేసింది.
బాహుబలి’ అనంతరం ఆమెకు పాన్-ఇండియా క్రేజ్ వచ్చింది. అదే సమయంలో సహనటుడు ప్రభాస్‌తో అనుష్క డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు మొదలయ్యాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయాలను అనుష్క, ప్రభాస్ ఇద్దరూ ఖండించారు. ఆ తరువాత ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో కూడా అనుష్క పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టాయి. అవి కూడా చివరికి వదంతులేనని తేలిపోయాయి. తాజా ఇంటర్వ్యూలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది అనుష్క. ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… బాహుబలి విడుదలైన తర్వాత నాపై పెళ్లి ఒత్తిడి ఎక్కువైంది. కుటుంబ సభ్యులే కాదు, మీడియా నుంచి కూడా ఇదే ప్రశ్న వస్తోంది. నాకు పెళ్లిపై పూర్తి నమ్మకం ఉంది. సరైన వ్యక్తి, సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా.
ప్రేమ లేకుండా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నేను ప్రేమించే వ్యక్తినే వివాహం చేసుకుంటాను. నా తల్లిదండ్రులు ఈ విషయంలో నాకు మద్దతుగా ఉన్నారు అని చెప్పింది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను అని అనుష్క తేల్చి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె భవిష్యత్తు జీవిత భాగస్వామి ఇండస్ట్రీ వ్యక్తి కాదనే క్లారిటీ వచ్చింది. కాగా, రవి తేజ, నాగార్జున, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాలు చేసిన అనుష్క, ఇటీవల సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది. ఈ విరామం ఆమె వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలకు దారితీసింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఘాటి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.