టీడీపీలో మంత్రులకు టెన్షన్ వదలడం లేదుట. కొద్ది రోజుల క్రితం ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబే కొత్త మంత్రులు వస్తారని వ్యాఖ్యలు చేశారని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దాంతో మంత్రులు అంతా నాటి నుంచే కలవరంతో ఉన్నారని చెబుతున్నారు. వైసీపీకి గట్టి కౌంటర్లు ఇవ్వడం లేదు, విపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోంది అయినా ఏమీ అనడం లేదు, ఇక పనితీరులో మెరుగుదల లేదు అని బాబు ఒక లెవెల్ లో క్లాస్ తీసుకున్నారని అంటున్నారు.
మరి బాబు మార్క్ క్లాస్ తీసుకున్న పుణ్యమో మరేమో కానీ తాజాగా జగన్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని విమర్శిస్తే అంతే ధీటుగా మంత్రులు చాలా మంది నుంచి కౌంటర్లు వచ్చిపడ్డాయి. జగన్ మీద ఒక్కొక్కరు వీర లెవెల్ లో విమర్శలు చేశారు. అయితే ఎవరెన్ని చేసినా కూడా మంత్రులలో అనుకున్న వారిని మాత్రమే కంటిన్యూ చేస్తారు అని అంటున్నారు.
కాదు అనుకున్న వారిని పక్కన పెడతారు అని అంటున్నారు. మంత్రులు జగన్ ని విమర్శించడమే తమ పని అనుకుంటే దాని వల్లనే మంత్రి పదవి నిలబడుతుందని అనుకుంటే అది పూర్తిగా అపోహ అని అంటున్నారు. చాలా మంది మంత్రులు ఈ రోజుకీ తమ శాఖల మీద పట్టు సాధించలేదు అన్నదే అధినాయకత్వం ఆగ్రహానికి కారణం అని అంటున్నారు. అంతే కాదు జిల్లాలలో టీడీపీని కో ఆర్డినేట్ చేసి పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యతలను పక్కన పెడుతున్నారు అన్నది కూడా ఉంది.
మరో వైపు చూస్తే అభివృద్ధి అజెండాతో జనంలోకి వెళ్ళాలని జిల్లా స్థాయిలో తమకు అప్పగించిన ఇంచార్జి పదవులకు న్యాయం చేయాలని కూడా ఉంది. అయితే ఈ విషయంలోనే చాలా మంది తడబడుతున్నారని అంటున్నారు. తాము ఇంకా అప్పగించిన శాఖల మీద పట్టు సాధించాల్సి ఉంది అలాగే పార్టీ మీద పట్టు పెంచుకోవాల్సి ఉందని మరచిపోతున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు. అందువల్ల ఉన్న వారితోనే కేబినెట్ నడుపుతూ వారికి క్లాసులు తీసుకుంటూ జనంలో ప్రభుత్వం గ్రాఫ్ ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదని అధినాయకత్వం భావిస్తోంది. అందువల్ల మరికొందరికి కొత్త వారికి చాన్స్ ఇచ్చి కేబినెట్ లో మార్పులు చేయడానికే చూస్తోంది అని అంటున్నారు.
ఆ రోజు ఎపుడు అన్నదే తెలియడం లేదుట. కానీ జరిగి తీరుతుందని అంటున్నారు. తాజాగా చూస్తే చంద్రబాబు గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలసి వచ్చారు. దాంతోనే చాలా మంది గుండెలలో రైళ్ళు పరిగెత్తాయి. మంత్రి వర్గ విస్తరణ విషయం మీద ఏమైనా మాట్లాడారా అని కూడా వాకబు చేసుకున్న వారు ఉన్నారు అంటే టెన్షన్ చాలానే ఉంది అని అంటున్నారు అయితే ఎవరు ఏ విధంగా ఆలోచించుకున్నా మంత్రివర్గంలో మార్పులు ఖాయమని అంటున్నారు. అది ఎపుడు జరుగుతుంది అంటే టీడీపీ అధినాయకత్వానికే తెలుసు అంటున్నారు.