తిరుపతి శ్రీకాళహస్తిలో ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురి చేసిన సంఘటన బొక్కసంపాలెం గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసులు (రాముడు) దారుణ హత్య సంఘటన ఉలిక్కిపాటికి గురిచేసింది. జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి ఈయన హత్య సొంత పార్టీ నేతలే చేయించారనే విధంగా వినిపించాయి. ముఖ్యంగా ఇందులో వినుత, చంద్రబాబు దంపతులే కారణమన్నట్లుగా చెన్నై పోలీసులు ప్రకటించారు. ఈ విషయం వైరల్ గా మారడంతో జనసేన పార్టీ నుంచి వీరిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సుమారుగా 10 సంవత్సరాలుగా వారి ఇంట్లోనే సహాయకుడిగా డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాసులను చంపడానికి కారణం ఏంటనే విషయం మాత్రం ఇంకా అంత చిక్కడం లేదు.
అధికార పార్టీ ప్రజా ప్రతినిధికి సహకరించారనే కారణం కూడా వినిపిస్తోంది. కానీ అటు వినుత, చంద్రబాబు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని జూన్ 22న వారు ప్రకటించారు.. అయితే ఈ పరిణామం చోటు చేసుకున్న 15 రోజులకే రాముడు చెన్నైలో విగతజీవిగా కనిపించారు. 2019 ఎన్నికలలో వినుత జనసేన పార్టీ నుంచి పోటీ చేయగా అందులో 5,274 ఓట్లను సాధించింది. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన అరాచకాల పైన పోరాడిన వీర మహిళగా వినుత పేరు సంపాదించింది.
ఏర్పేడు మండలంలో రైతులకు అండగా నిలిచింది. ఆ సమయంలో ఆమె భర్తను జైలుకు కూడా పంపించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో వీరికి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిణామాలతోనే శ్రీనివాసులు హత్యకు గురి కావడం సంచలనంగా మారుతున్నది. అయితే ఈ హత్యకు కారణం పార్టీలకు సంబంధము లేకపోతే ఏంటా అనే విషయం తెలపాలని అధికారులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు.
మరణించిన శ్రీనివాసుల్ కూడా పేద కుటుంబమని తల్లితండ్రులు లేకపోవడంతో తన అమ్మమ్మ రాజేశ్వరి వద్ద ఉంటున్నారట. జూన్ 21 నుంచి తన ఇంటికి రాలేదని తన అమ్మమ్మ తెలియజేస్తోంది. అయితే తనంతట తాను ఆ పని చేశారా లేకపోతే ఎవరైనా తీసుకెళ్లి చేశారా అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే మారింది. అయితే మధ్యలో రెండు సార్లు మాత్రం ఫోన్ చేసి తన అమ్మమ్మ క్షేమ సమాచారం కూడా అడిగారని శుక్రవారం రోజున తనను చెన్నైకి తీసుకువెళ్లి మృతదేహాన్ని చూపించడంతో బోరున ఏడ్చేసింది శ్రీనివాసులు అమ్మమ్మ. మనవడిని కూడా కక్షపూరితంగానే చంపారంటూ మాట్లాడుతోంది.