అనసూయ భరద్వాజ్ ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ ఫోటోషూట్లతో, లైఫ్ స్టైల్ అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన స్విమ్మింగ్ పూల్ ఫోటోలు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారాయి. బ్లాక్ స్విమ్ సూట్‌లో ఐస్లాండ్ చల్లని వాతావరణంలో ఆనసూయ సేదతీరుతున్న ఫోటోలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
సన్ గ్లాసెస్‌తో స్టైలిష్‌గా, ఫ్రెష్‌గా కనిపించిన ఆమె లుక్స్ ఫ్యాన్స్‌కి కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. దీంతో బికినీ కంటే ఘాటుగా ఆ లుక్స్ ఉన్నాయని కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఇక ఇప్పటికే నటిగా అనసూయ మంచి క్రేజ్ అందుకుంది. ఆమె బుల్లి తెరపై యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, టాప్ టెలివిజన్ హోస్ట్‌గా పేరు సంపాదించింది.
ముఖ్యంగా “జబర్దస్త్” వంటి షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఆ తరువాత సినిమాల్లో కూడా తన ప్రతిభను చూపించింది. రంగస్థలం, పుష్ప వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రత్యేకంగా పుష్ప సినిమాలో అనసూయ, తన నెగటివ్ షేడ్స్‌తో కూడిన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది.
ఇక టెలివిజన్‌లో మాత్రమే కాదు, వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, స్టేజ్ షోలు ఇలా విభిన్న రంగాల్లో తన ప్రతిభను రుజువు చేస్తూ ముందుకు సాగుతోంది. సోషల్ మీడియాలో అనసూయ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితంలోని చిన్నచిన్న క్షణాలను, ఫ్యాషన్ లుక్స్‌ని పంచుకుంటూ అభిమానులతో కనెక్ట్ అవుతోంది. ఇక లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఈ పూల్ ఫోటోలు కొన్ని నిమిషాల్లోనే వేల లైక్స్ సంపాదించాయి. క్వీన్ ఆఫ్ బ్యూటీ అంటూ ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేసే లుక్స్ ఇస్తోందిని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.