ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బు వేటలో ఉన్నారు. సుఖం అనే వేటలో బిజీగా ఉన్నారు. కానీ కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆ రెండిటినీ విడిచిపెట్టడంలోనే నిజమైన సుఖం ఉందని అంటున్నారు అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ మెగాస్టార్ తన సుదీర్ఘ అనుభవం నుంచి కొన్ని పాఠాలను తన అభిమానుల కోసం చెబుతున్నారు.
వాటిలో యువతరం ఎలా జీవించాలి? అనే గొప్ప విషయాలు ఉన్నాయి. తరాలు మారుతుంటే విలువలు మారుతున్నాయని అమితాబ్ అన్నారు. సింపుల్‌గా సంతృప్తిగా ఉండటం ముఖ్యం.. డబ్బు విలాసాలతో పాటు వచ్చే చిక్కులు చాలా పెద్దవి అని గుర్తు చేసారు. నేటి యూత్ కి కొన్ని సొంత నమ్మకాలు ఉంటాయి.. వారికి నచ్చనివి ఉంటాయి. పెద్దలకు గడిచిన కాలంతో సంబంధం ఉంటుంది.. రాబోవు తరం ఏం చేస్తుందో ఒక రహస్యం! అని కూడా అమితాబ్ అన్నారు.
మన తర్వాతి తరం ఎలా ఉండాలో చెప్పడంలోనే మన గొప్పతనం ఇమిడి ఉందని అమితాబ్ వ్యాఖ్యానించారు. జీవితంలో ఏదీ చివరకు తోడుగా రాదని కూడా అన్నారు. పెద్దవాళ్లు వదిలి పెట్టేవి తర్వాతి తరం నేర్చుకోవడం ముఖ్యమని కూడా తెలిపారు. అమితాబ్ తన బ్లాగులో రాసే ప్రతిదీ ఆణిముత్యం లాంటిదే. ఇప్పుడు యువతనుద్ధేశించి ఆయన చెప్పిన నాలుగు మాటలు కూడా ఎంతో విలువైనవి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, 70 ప్లస్ వయసులోను ఆయన ఎదురే లేని యువకుడిలా ఉన్నారు. బిగ్ బి తిరిగి కల్కి 2898 ఏడి -2లో అద్భుతమైన పాత్రతో తిరిగి వస్తారని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దీపిక పదుకొనే ఈ సీక్వెల్ సినిమా నుంచి నిష్కృమించినా.. అమితాబ్ ఛామ్ పాన్ ఇండియాలో పెద్దగా సహకరిస్తుందనడంలో సందేహం లేదు.