రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం చరణ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ టచ్‌తో కొత్త లుక్ కోసం చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఫోటోలు బయటకు వచ్చాయి. వాటిలో చరణ్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, మాస్ అటిట్యూడ్‌తో అదరగొడుతూ కనిపించాడు.
పెద్ది కోసం ఆయన ఎంతగా శ్రమిస్తున్నారో, ఎంతగా తన పాత్రలోకి లీనమవుతున్నారో ఈ స్టైలిష్ లుక్స్ ద్వారా స్పష్టమవుతోంది. చరణ్ ఈ లుక్ ఫోటోలను చూసి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. “ఇది బాడీ కాదు బాక్సాఫీస్” అంటూ కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. కొందరు “చరణ్ లుక్ మామూలుగా లేదురా.. పెద్ది మాస్ తుఫాను మామూలుగా ఉండదు” అంటూ హంగామా చేస్తున్నారు. అభిమానుల ఈ రెస్పాన్స్ చూస్తే సినిమా రిలీజ్ వరకు సోషల్ మీడియాలో చరణ్ లుక్ టాపిక్ హీట్‌గా ఉండడం ఖాయం అని చెప్పాలి.
ఇక పెద్ది సినిమా గురించి చెప్పుకుంటే.. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఈ మూవీ నిర్మాణం జరుగుతోంది. ఉప్పెనతో బ్లాక్‌బస్టర్ కొట్టిన బుచ్చి బాబు, ఇప్పుడు గ్లోబల్ స్టార్‌తో వర్క్ చేస్తుండడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. సినిమాలో చరణ్ ఓ రగ్డ్ మాస్ లీడర్‌గా కనిపించనున్నాడని బజ్. ఇప్పటికే షూట్ చేసిన ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్, నైట్ ఫైట్స్ గురించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పంచుకున్న అప్‌డేట్స్ అంచనాలను మరింత పెంచేశాయి.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి అగ్రతారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్‌కు భారీ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్‌ను జోడిస్తూ పెద్ది సినిమాను గ్రాండ్ విజువల్ ట్రీట్‌గా మలుస్తున్నారని సమాచారం.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. చరణ్ లుక్, మాస్ బాడీ లాంగ్వేజ్ చూసి ఫ్యాన్స్ బ్లాక్‌బస్టర్ పక్కా అని ఫిక్స్ అయ్యారు. గ్లోబల్ స్టార్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నాడని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. ఈసారి చరణ్ ఎలాంటి కలెక్షన్లు సాధిస్తాడో, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి..పెద్ది మూవీని 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.